UFO: 171 మిస్టీరియస్ UFOలపై నో క్లారిటీ.. అమెరికా పెంటగాన్ కీలక నివేదిక

ఎగిరే పల్లాలను UFOలు అంటారని మనకు తెలుసు. గత సంవత్సరం అమెరికాలో 366 చోట్ల UFOలను గుర్తించారు.

Published By: HashtagU Telugu Desk
Ufo Cases

Ufo Cases

171 New UFO Cases: ఎగిరే పల్లాలను UFOలు అంటారని మనకు తెలుసు. గత సంవత్సరం అమెరికాలో 366 చోట్ల UFOలను గుర్తించారు. వీటిలో 195 UFOలు కాదని.. 26 డ్రోన్‌లు, 163 బెలూన్‌లు, 6 పక్షులు లేదా ప్లాస్టిక్ బ్యాగ్‌లు అని వెల్లడైంది. వివరణాత్మక డేటా లేకపోవడం వల్ల 171 UFO కేసులు ఇంకా గుర్తించబడలేదు.  పెంటగాన్ ఈ కేసులను గుర్తించలేకపోయామని చెప్పింది. అమెరికా రక్షణ శాఖకు చెందిన పెంటగాన్ విడుదల చేసిన 11 పేజీల UAP 2022 నివేదికలో ఈ వివరాలను ప్రస్తావించారు.

వాస్తవానికి ఈ నివేదికలో మొత్తం 510 UFO వీక్షణ కేసుల వివరాలు ఉన్నాయి. 2004 నుంచి 2017 మధ్య కాలంలో అమెరికాలోని మరో 144 చోట్ల కూడా UFOలను గుర్తించారు. ఈ నివేదికను డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ODNI) కార్యాలయం విడుదల చేసింది. వివిధ నిఘా సంస్థలు, మిలిటరీ ఇంటెలిజెన్స్ కార్యాలయం అనేక విభాగాల నుంచి ఇన్‌పుట్‌లు సేకరించి ఈ నివేదికను రూపొందించారు. ఇందులో గ్రహాంతర వాసుల ప్రస్తావన లేదు.
వీటిని చూసిన ఏ వ్యక్తిలోనూ ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని నివేదికలో రాశారు. అయితే గతంలో పెంటగాన్ విడుదల చేసిన ఒక నివేదికలో.. UFOలను చూసిన తర్వాత కొంతమందిలో రేడియేషన్ బర్న్, బ్రెయిన్ డ్యామేజ్ వంటి సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు.  UFO పరిశోధనలపై కొంతకాలంగా అమెరికా అత్యంత ఆసక్తి కనబరుస్తోంది.

2022 ప్రారంభంలో, ఈ UFO వీక్షణలను పరిశోధించడానికి పెంటగాన్ ప్రత్యేకంగా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది.  దీనిని ఆల్-డొమైన్ అనోమలీ రిజల్యూషన్ ఆఫీస్ అంటారు. ఈ కార్యాలయం 366 కొత్త UFO కేసుల పరిశోధన బాధ్యతను చేపట్టింది.

  Last Updated: 16 Jan 2023, 01:19 AM IST