Viral Video : పోలీస్ స్టేషన్ లో పిల్లల ‘పెన్సిల్’ పంచాయితీ.. కంప్రమైజ్ చేసిన పోలీసులు!

సాధారణంగా పిల్లల మధ్య గొడవ జరిగితే ఏం చేస్తారు..? పేరెంట్స్  కు కంప్లైంట్ చేస్తారు? లేదా టీచర్స్ కు చెప్పుకుంటారు. కానీ ఈ ఫొటోలో కనిపించే పిల్లలు ఏం చేశారో తెలిసే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 01:32 PM IST

సాధారణంగా పిల్లల మధ్య గొడవ జరిగితే ఏం చేస్తారు..? పేరెంట్స్  కు కంప్లైంట్ చేస్తారు? లేదా టీచర్స్ కు చెప్పుకుంటారు. కానీ ఈ ఫొటోలో కనిపించే పిల్లలు ఏం చేశారో తెలిసే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. పెన్సిల్ పంచాయితీకే పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఒకరిపైఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పిల్లలేంటి? పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఏంటీ? అని నెటిజన్స్ నోరేళ్లబెట్టారు. మరి పిల్లలా.. మజాకానా..!

కర్నూలు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు నిన్న (గురువారం) పోలీస్ స్టేషన్ కు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఆ పిల్లలకు పట్టుమని పదేళ్లు కూడా ఉండవు. తోటి విద్యార్థి తన పెన్సిల్‌, పుస్తకాలు తీసుకుంటున్నాడు. రోజు ఇలానే చేస్తున్నాడని.. పోలీసులకు తెలిపాడు. అతని మీద కేసు పెట్టమని కోరాడు. అందులో ఓ పిలగాడి పేరు హన్మంతు ‘‘సార్ దినం నా పెన్సిల్, దుడ్లు తీసుకుంటున్నాడని,  మీరు కేసు పెట్టండి’’ అంటూ పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు ‘‘ఓరేయ్ హన్మంతు ఇదొకసారికి పెద్ద మనసు చేసుకో.. కేసు పెడితే వాళ్ల అమ్మానాన్న ఏం కావాలి’’ అంటూ సర్ది చెప్తారు. బుడ్డోడు పోలీసుల ముందు ఓకే చెప్పి, చేతులు కలిపినా.. తగ్గేదే లే అంటూ అక్కడ్నుంచీ వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. ‘‘వార్ని వీళ్లు పిల్లలు కాదు.. పిడుగులు’’ అంటూ.. ‘హౌ క్రేజీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.