Site icon HashtagU Telugu

Viral Video : ట్రక్కుమీదికి వచ్చినా..తప్పించుకున్న వ్యక్తి…వైరల్ వీడియోపై స్పందించిన కేటీఆర్..!!

Viral Video Ktr

Viral Video Ktr

సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఓ వీడియోపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫుట్ పాత్ పై నిలబడి ఉన్న వ్యక్తి ఓ పెద్ద ప్రమాదం నుంచి క్షణాల్లో తప్పించుకున్నాడు. ఈ వీడియోకు మంత్రి రీట్వీట్ చేశారు. గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో. ఓ ట్రక్ మీదికి దూసుకొచ్చినా అద్రుష్టం కొద్దీ తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను IPSఅధికారి దీపాంశుకబ్రా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ వీడియో ఇఫ్పటికి 4మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.

అసలు ఈ వీడియోలో ఏముందంటే…ఓ వ్యక్తి ఫుట్ పాత్ పై నిలబడి ఉన్నాడు. అయిదే సమయంలో ఓ ట్రక్కు వేగంగా వచ్చి పక్కన చెట్టుకొమ్మలకు ఈ ట్రక్ వేగంగా తగులుతుంది. దీంతో అది బ్యాలెన్స్ తప్పి ఆ వ్యక్తిపైకి దూసుకొచ్చింది. అయితే అద్రుష్టం కొద్ది అతడు ట్రక్కు గేటుకు మధ్య ఇరుక్కుపోయాడు. ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నాడు. అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా కూడా క్షణాల్లోనే జరిగింది. ఈ వీడియోను షేర్ చేస్తూ జీవితం చాలా అనూహ్యమైంది అంటూ క్యాప్షన్ పెట్టారు.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. కొందరు ఆ వ్యక్తిని అదృష్టవంతుడిగా పేర్కొన్నారు. మరో యూజర్ ఓహ్ ఆయన జీవిత కథను చెప్పడానికి సేఫ్ గా ఉన్నాడు అని రాశాడు. ఈ వీడియోపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. రీట్వీట్ చేస్తూ ఓ డార్న్ అతడు ఎలా బతికాడు…అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో చాలామంది దీనిని షేర్ చేస్తున్నారు.