Site icon HashtagU Telugu

Pawan Kalyan : అనంత్ అంబానీ రిసెప్షన్‌ వేడుకలో ఏపీ డిప్యూటీ సీఎం సందడి

Pawan Ambani

Pawan Ambani

అంబానీ ఇంట‌ పెళ్లి సంబ‌రాలు (Anant Ambani Wedding) అంబురాన్ని తాకుతున్నాయి. ఇండియాలో ఏ పారిశ్రామిక వేత్త‌కు సాధ్యం కాని రేంజ్ లో వేడుక‌లు అంబానీ ఇంట జరుగుతున్నాయి. నిన్న రాత్రి అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక (Anant Ambani-Radhika Merchant Wedding) అట్టహాసంగా జరిగింది. అనంత్ తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ప్రముఖులు హాజరై సందడి చేసారు. ఈరోజు శుభ్ ఆశీర్వాద్ ( ‘Shubh Ashirwad’ Ceremony) వేడుక జరుగుతుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధులను మాత్రమే అంబానీ ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానం అందుకున్న వారిలో ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) లు ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ గా పవన్ కళ్యాణ్ నిలిచారు. సినిమాల పరంగానే కాదు రాజకీయాల పరంగా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అగ్ర స్థానంలో ఉండడం తో ఆయన పాపులార్టీ మరింత పెరిగింది. నేడు హైదరాబాద్ నుంచి ముంబై చేరుకున్న పవన్.. కొద్దిసేపటి క్రితమే శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరయ్యారు. ఇక ఆయన దీక్షలో ఉండడంతో అవే దీక్షా వస్త్రాలతో కనిపించారు. అక్కడ రాజకీయ నేతలను పలకరించిన పవన్.. అబ్బాయ్ రామ్ చరణ్ ను సైతం కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు సైతం సతీమణి నారా భువనేశ్వరితో హాజరయ్యారు.

Read Also : MLA Gudem Mahipal Reddy : కాంగ్రెస్ గూటికి పఠాన్‌చెరు ఎమ్మెల్యే..? సీఎం రేవంత్ తో భేటీ..!