తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కన్నా ..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే (AP Deputy CM Pawan Kalyan)బెటర్ అని ఋజువైందా..అంటే అవుననే చెప్పాలి. తాజాగా మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికల్లో (Maharashtra Elections) మహాయుతి ప్రభంజనం (Mahayuti alliance) సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ మెజార్టీ సాధించడం తో బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా బిజెపి హావ నడుస్తుందని..ప్రజలంతా బిజెపినే కోరుకుంటున్నారని మరోసారి మహారాష్ట్ర , ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో రుజువైందని చెపుతున్నారు. అయితే ఈ ఫలితాలతో తెలంగాణ సీఎం రేవంత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర ఫలితాలకు సీఎం రేవంత్ కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు రేవంత్ ప్రధాన కారణం కావడం తో..కాంగ్రెస్ అధిష్టానం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ ను బరిలోకి దింపారు.
మహారాష్ట్రలోని నయాగామ్, భోకర్, నాందేడ్, షోలాపూర్, నాగ్‌పూర్, రాజూరా, డిగ్రాస్, వార్దా వంటి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంలో తనదైన మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. NDA కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వివరించారు. ఇదే సమయంలో తెలంగాణకి 11 నెలల్లో ఏం చేశారో.. ఎలాంటి పథకాలు అందించారో తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అదే విధంగా మహారాష్ట్రలో చేస్తాం అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ ప్రచాచారంలో పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. దాంతో కాంగ్రెస్ కూటమి ఆయా ప్రాంతాల్లో పట్టు సాధిస్తుందని శ్రేణులు ధీమా వ్యక్తం చేసారు. కానీ ఈరోజు వచ్చిన ఫలితాలు మాత్రం భారీ షాక్ ఇచ్చాయి. రేవంత్ ప్రచారం చేసిన దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఓటమి చెందారు. ఒక్కరు ఇద్దరు తప్ప అంతా వెనుకంజలోనే కొనసాగారు.
ఇక ఇదే ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం , జనసేనధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు భారీ విజయం సాధించారు . NDA తరఫున పుణె, బల్లార్పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్ నియోజకవర్గాల్లో జనసేనాని క్యాంపెయిన్ చేశారు. పవన్ కళ్యాణ్ తన పర్యటించిన ప్రాంతాల్లో ఎక్కువగా హిందుత్వ, సనాతన ధర్మం, మరియు ప్రాంతీయ అంశాలపై తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తర్వాత.. జమ్ము కాశ్మీర్ లో శాంతి కనిపిస్తుందని, అద్భుత అయోధ్య నిర్మాణం సాధ్యమైందని, నలువైపుల నూతన రోడ్లు నిర్మాణమవుతున్నాయంటూ చెప్పుకొచ్చారు.
అలాగే బీజేపీ హాయలోనే దేశంలోని రైతులు, పారిశ్రామిక వేత్తలకు అందుతున్న ప్రయోజనాల్ని పేర్కొన్నారు. సనాతన ధర్మం కోసం నిజ జీవితంలో పోరాడడం అనేది సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలను చేయడంలా తేలికగా ఉండదని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర దేవాలయాలు, సంస్కృతి, భాష భద్రంగా ఉండటానికి శివాజీ చేసిన కృషిని పవన్ గుర్తుచేశారు. శివాజీ నేలపై బెదిరింపులకు తాము భయపడమని స్పష్టంగా హెచ్చరించారు. మహాయుతి కూటమికి వ్యతిరేకంగా అఘాడీ కూటమిలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. శివసేనా వ్యవస్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రే.. దేశాన్ని రక్షించేందుకు, బలమైన దేశ నిర్మాణానికి కృషి చేశారని పొగడ్తలు కురిపించారు. మనమంతా విడిపోయి బలహీన పడిపోదామా.? కలిసి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర లక్షకోట్ల ఆర్థిక వ్యవస్థ కోసం మహాయుతి కూటమి ప్రయత్నిస్తోందన్న పవన్ కళ్యాణ్.. అందుకు మద్ధతుగా నిలవాలని . మన దేశం కోసం, మన ధర్మం కోసం నిలబడాలంటూ కార్యకర్తక దిశానిర్దేశం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మరాఠి సంస్కృతి కోసం, మరాఠి భాష కోసం ప్రజలంతా మహాయుతి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునివ్వడం జరిగింది. దీంతో ఓటర్లు బిజెపి అభ్యర్థులకు మద్దతు పలికినట్లు తెలుస్తుంది. ఇలా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ సత్తా చాటాడడంతో మరోసారి మోడీ దృష్టిలో పవన్ స్థానం మరింత పెరిగింది. పవన్ స్థాయి..స్టామినా తెలుసు కాబట్టి బిజెపి అధిష్టానం పవన్ కళ్యాణ్ ను దింపిందని..ఆ నమ్మకం మరోసారి నిలబడిందని మాట్లాడుకుంటున్నారు.
Read Also : Governor Statue : రాజ్‌భవన్‌లో గవర్నర్ విగ్రహం.. స్వయంగా ఆవిష్కరించిన ఆనంద్ బోస్