Pawan & Modi : NDA సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుండి ఒక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే వెళ్లారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు మారే ఏ పదవి లేదు. అయినప్పటికీ మోడీ నుండి ఆహ్వానం అందిందంటే మాములు విషయం కాదు. పవన్ స్టామినా ఏంటో ఈ ఆహ్వానం తో మరోసారి రుజవైంది. నిజాయితగా ప్రజలకు సేవ చేయాలె కానీ పదవులతో సంబంధం లేదని పవన్ కళ్యాణ్ ద్వారా అందరికి అర్థమైంది. రెండుసార్లు పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరంలో నిల్చున్న కానీ ప్రజలు మద్దతు ఇవ్వలేదు. ఫస్ట్ టైం జనసేన పార్టీ టీడీపీ, బిజెపి పార్టీలకు సపోర్ట్ చేసింది కానీ ఎన్నికల బరిలో నిల్చోలేదు. 2019 లో ఒంటరిగా బరిలోకి దిగింది కానీ ప్రజలు సపోర్ట్ చేయలేదు. అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా పదవి లేకపోతేనేం.. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా అంటూ పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నాడు.
ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన దూకుడు పెంచారు. ఎలాగైనా రాష్ట్రంలో వైస్సార్సీపీ ని గద్దె దించాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. వైస్సార్సీపీ ని గద్దె దించాలంటే సింగిల్ గా వెళ్తే కుదరదు. బిజెపి సపోర్ట్ లేదా టీడీపీ సపోర్ట్ తీసుకోవాలి. ఇది ముందునుండి కూడా పవన్ చెపుతూ వస్తున్నాడు. ఇక ఢిల్లీ వేదికగా కూడా అదే విషయాన్నీ తెలిపాడు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బిజెపి లు కలిసి వస్తున్నాయి అని తేల్చేసాడు. ఈ ప్రకటనతో వైస్సార్సీపీ లో మరింత భయం పట్టుకుంది. మొన్నటి వరకు జనసేన , టీడీపీ లు మాత్రమే కలుస్తాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు ముగ్గురు కలిసి రాబోతున్నట్లు పవన్ చెప్పడం ..మోడీ సైతం పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పంపడం.. వైస్సార్సీపీ శ్రేణుల్లో కంగారు మొదలైంది. అలాగే అందులో ఉన్న నేతలు ఇప్పటి నుండే తమ రాజకీయ భవిష్యత్ ఫై ఆలోచన చేయడం స్టార్ట్ చేసారు.
ప్రజల్లో వైస్సార్సీపీ కి వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత రాబోయే ఎన్నికల్లో గట్టిగా చూపిస్తారు. అందుకే వైస్సార్సీపీ లో ఉంటె కుదరదని చాలామంది నేతలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలలో జనసేన పార్టీ కే ప్రజలు ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు. అందులో చేరితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని కొంతమంది వైస్సార్సీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే వైస్సార్సీపీ పార్టీ కీలక నేతలు పంచకర్ల రమేష్ , ఆమంచి స్వాములు జనసేన పార్టీ లోకి వచ్చేసారు. త్వరలో మరో కీలక నేత మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సైతం జనసేన కండువా కప్పుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా పెద్ద ఎత్తున ఇతర పార్టీ నేతలు జనసేన లోకి చేరుతుండడం తో జనసేన శ్రేణులతో పాటు ప్రజలు సైతం జనసేన పార్టీ కి మంచి రోజులు రాబోతున్నాయని మాట్లాడుకుంటున్నారు.
మొన్నటి వరకు జనసేన పార్టీ లో కేవలం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాత్రమే అని అనుకున్న చాలామంది..ఇప్పుడు కీలక నేతలంతా జనసేన పార్టీ లోకి క్యూ కడుతుండడం తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో కొంతమంది ఈర్ష పడుతున్నారు. ముఖ్యంగా జనసేన కు వారాహి యాత్ర బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ కు ఎంత సపోర్ట్ ఇస్తున్నారో తేలింది. అలాగే రాజకీయ నేతల్లో సైతం జనసేన లోకి వెళ్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ప్రస్తుతం ఈ యాత్ర రెండు దశలు పూర్తి చేసుకుంది. ఇక రాష్ట్రం మొత్తం పవన్ పర్యటిస్తే ..ఇంకెంత ఆదరణ వస్తుందో..ఇంకెంతమంది నేతలు జాయిన్ అవుతారో చూడాలి.
Also Read: BC Bandhu: బీఆర్ఎస్ లో వర్గపోరు.. నిలిచిపోయిన బీసీ బంధు!