Site icon HashtagU Telugu

Video: రైలును వెనక్కి నెట్టిన ప్ర‌యాణికులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

Saharanpur Delhi Train Fire Broke Out

Saharanpur Delhi Train Fire Broke Out

ఉత్త‌ర‌ప్రదేశ్‌లో ప్ర‌యాణికులు చేసిన సాహ‌సం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. యూపీలోని మీర‌ట్ జిల్లాలో ఉన్న దౌరాలా రైల్యే స్టేష‌న్‌లో మార్చి 5 శ‌నివారం ఉదయం షహరాన్‌పూర్‌-ఢిల్లీ ప్యాసింజర్ రైల్లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఆ రైలు ఇంజిన్‌తో పాటు రెండు ఇంజిన్ త‌ర్వాత ఉన్న రెండు బోగీలు కూడా మంట‌ల్లో చిక్కుకున్నాయి. వెంట‌నే అల‌ర్ట్ అయిన ప్ర‌యాణికులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

అయితే ఇక్క‌డ వైర‌ల్ మ్యాట‌ర్ ఏంటంటే.. ఆ మంటలు మిగతా బోగీలకు అంటుకోకుండా ప్రయాణికులు చేసిన సాహసం గురించి, సోష‌ల్ మీడియాలో దేశ వ్యాప్తంగా చ‌ర్చించుకుంటున్నారు. మంట‌లు మిగ‌తా బోగీల‌కు అంటుకోకుండా ఉండేందుకు, ఆ ప్యాసింజర్‌ రైల్లో ప్రయాణిస్తున్న ప్ర‌యాణికులు కిందికి దిగి రైలును తోశారు. దీంతో ఆ రెండు బోగీలు, ఇంజిన్‌ నుంచి వేరుపడిన మిగతా బోగీలను తోసుకుంటూ దూరంగా తీసుకెళ్లారు. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ గాయాలు కాలేదు.. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. పెద్ద ప్రమాదంగా మారకుండా ఉండేందుకు ప్రయాణికులు ఏకంగా రైలునే తోయడం, ఈ వీడియోను ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డంతో, ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.