Site icon HashtagU Telugu

PM Modi Speaks To Manu Bhaker: మ‌ను భాక‌ర్‌కు ప్ర‌ధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..?

PM Modi Speaks To Manu Bhaker

PM Modi Speaks To Manu Bhaker

PM Modi Speaks To Manu Bhaker: ఆదివారం జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ షూటర్‌ మను భాకర్‌ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో ఈ పతకాన్ని సాధించింది. ఈ విధంగా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం లభించింది. అయితే కాంస్య పతక విజేత మను భాకర్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో (PM Modi Speaks To Manu Bhaker) మాట్లాడారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మను భాకర్‌ను అభినందించారు. అనంతరం మను భాకర్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఒక చారిత్రాత్మక పతకం. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన మను భాకర్. కాంస్య పతకానికి అభినందనలు. ఈ విజయం మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆమె భారతదేశం తరుపున షూటింగ్‌లో పతకం సాధించిన మొదటి మహిళగా నిలిచింది. ఇది అపురూపమైన విజయమ‌ని ప్ర‌ధాని మోదీ ఎక్స్ వేదిక‌గా మ‌ను భాక‌ర్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే మోదీ ట్వీట్‌కు మ‌ను భాక‌ర్ స్పందిస్తూ.. గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు.. మీ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. మీ మద్దతు, ప్రోత్సాహానికి నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అని బదులిచ్చింది.

Also Read: SL vs IND Highlights: టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ.. మ‌రో మ్యాచ్ ఉండ‌గానే సిరీస్ కైవ‌సం..!

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మను భాకర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వారి సంభాషణకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మనుభాకర్ మధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది. ప్రధానమంత్రితో మాట్లాడిన తర్వాత షూటర్ మాట్లాడుతూ.. ప్ర‌ధాని మోదీ తన బిజీ షెడ్యూల్ నుండి సమయం తీసుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేము సుదీర్ఘ సంభాషణ చేశాం. ప్ర‌ధాని మోదీ నన్ను అభినందించారు. ఈరోజు నాకు నాకు చాలా ముఖ్యమైన రోజు అని భాక‌ర్ చెప్పుకొచ్చారు.

ఇక‌పోతే పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 221.7 పాయింట్లతో మను భాకర్ మూడవ స్థానంలో నిలవగా.. దక్షిణకొరియాకు చెందిన వైజే ఓహ్ 243.2 పాయింట్లతో స్వర్ణం గెలుచుకుంది. తన దేశానికి వైజే కిమ్ 241.3 పాయింట్లతో రజతం గెలుచుకుంది.

We’re now on WhatsApp. Click to Join.