60 Lakh Rats Murder Plan : 60 లక్షల ఎలుకల మర్డర్ కు ప్లాన్.. చివరకు ఏమైందంటే ?

60 Lakh Rats Murder Plan : ఫ్రాన్స్ రాజధాని పారిస్ ను ఎలుకలు వణికిస్తున్నాయి. అక్కడి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. 21 లక్షల జనాభా ఉన్న పారిస్ సిటీలో 60 లక్షల ఎలుకలు ఉన్నాయి.. ఆ ఎలుకలను చంపే ప్లాన్ ను పారిస్ నగర పాలక సంస్థ రెడీ చేసింది. కట్ చేస్తే..  ఏమైందో తెలుసా ? 

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 10:16 AM IST

60 Lakh Rats Murder Plan : ఫ్రాన్స్ రాజధాని పారిస్ ను ఎలుకలు వణికిస్తున్నాయి.

అక్కడి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. 

21 లక్షల జనాభా ఉన్న పారిస్ సిటీలో 60 లక్షల ఎలుకలు ఉన్నాయి..

ఆ ఎలుకలను చంపే ప్లాన్ ను పారిస్ నగర పాలక సంస్థ రెడీ చేసింది. 

కట్ చేస్తే..  ఏమైందో తెలుసా ? 

60 లక్షల ఎలుకలను చంపేందుకు పారిస్ నగర పాలక సంస్థ రెడీ అయింది. ఇందుకోసం రూ. 14 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. అయితే సడెన్ గా ఆ ప్లాన్ ను క్యాన్సల్ చేసింది. ఇందుకు ఒక కారణం ఉంది. అదేమిటంటే.. వాస్తవానికి పారిస్ నగరంలోని 60 లక్షల ఎలుకలను చంపేందుకు (60 Lakh Rats Murder Plan) 2017లోనే  రూ.14 కోట్ల ప్లాన్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా నగరంలోని అత్యంత మురికిమయ ప్రదేశాలలో ఎలుకలను చంపే విషాన్ని ఉంచారు. దీంతో పారిస్  రోడ్లపై 5600 టన్నుల చెత్త పేరుకుపోయింది. దీంతో ఎలుకల సమస్య మరింత పెరిగింది.

Also read : 300 Million Rats: ఎలుకలతో ఇబ్బంది పడుతున్న బ్రిటన్.. 300 మిలియన్ ఎలుకలు బీభత్సం

ఈనేపథ్యంలో పారిస్ నగర పాలక సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుంది. పారిస్ సిటీలోని ఎలుకలను చంపాలనే పంతం కంటే.. వాటితో కలిసి జీవించాలనే ఆలోచనే మంచిదని పారిస్ మేయర్ ఆన్ హిడాల్గో ప్రకటించారు. పారిస్ ప్రజలు ఎలుకలతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. దీనిపై ఓ కమిటీ వేస్తామని వెల్లడించారు. ఈ కమిటీ ఎలుకలతో ఎటువంటి సమస్య లేకుండా జీవించడానికి, వాటిని చంపకుండా ఉండటానికి సాధ్యమయ్యే మార్గాలను పరిశీలిస్తుందన్నారు.

Also read :Rat Damage : చూడటానికి చిట్టీ ఎలుక.. అది చేసిన పనే రూ.5 లక్షలు పరిహారం కట్టేలా?

పారిస్ వాసులకు ఎలుకలంటే ఎందుకు భయం ?

14వ శతాబ్దంలో వచ్చిన ప్లేగు వ్యాధి భయాన్ని పారిస్ వాసులు  ఇప్పటికీ మర్చిపోలేదు. దీని కారణంగా అప్పట్లో ఐరోపాలో 25 లక్షల మందికిపైగా ప్రజలు మరణించారు. ఎలుకల వల్లే ఆ వ్యాధి వ్యాపించిందని భావిస్తున్నారు. దీని తరువాత అప్పట్లో ఎలుకలను పెద్ద సంఖ్యలో చంపడం ప్రారంభించారు. ఎలుకలను చంపేవారికి డబ్బులు కూడా  ఇచ్చారు. ఎలుకలను చంపి వాటి తొక్కలను తెచ్చి చూపించి జనం డబ్బులు తీసుకున్నారు.  19వ శతాబ్దంలో ఫ్రెంచ్-రష్యన్ యుద్ధం మధ్యలో ఎలుకలు సైనికుల ఆకలిని తీర్చాయి. 1870లో సైనికులు ఎలుక మాంసాన్ని వండుకొని తిన్నారు.