Crime: మద్యం కోసం అలాంటి పనికి దిగజారిన తల్లిదండ్రులు.. రెండు నెలల చిన్నారిని అలా?

ప్రస్తుత సమాజంలో మనుషులు డబ్బుల కోసం ఎంతటి నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బు కోసం ఎదుటి వ్యక్తిని చంపడానికి చావడానికైనా వెనకాడటం లేదు.

  • Written By:
  • Updated On - September 18, 2022 / 10:32 AM IST

ప్రస్తుత సమాజంలో మనుషులు డబ్బుల కోసం ఎంతటి నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బు కోసం ఎదుటి వ్యక్తిని చంపడానికి చావడానికైనా వెనకాడటం లేదు. అదేవిధంగా అదే డబ్బుల కోసం బంధాలను కూడా అమ్ముకుంటున్నారు. తాజాగా తల్లిదండ్రులు పచ్చనోట్ల కోసం ఏకంగా కన్న ప్రేమని అమ్మేశారు. మద్యానికి బానిసలైన ఆ తల్లిదండ్రులు పశువుల కంటే హీనంగా ప్రవర్తించారు. మద్యం కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడంతో ఏకంగా రెండు నెలల చిన్నారిని 30 వేల రూపాయలకు అమ్మేశారు. మానవత్వం సిగ్గుపడే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లిఖింపూర్ లో ఖేరీలో చోటు చేసుకుంది.

ఆ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఆ చిన్నారిని కొనుక్కున్న ఆ వ్యక్తి తిరిగి తల్లిదండ్రులకు అప్పగించేశారు. ఆ తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని లిఖింపూర్ ఖేరీ లో మొహమ్మది కొత్వాలి ప్రాంతానికి చెందిన జగ్తార్ సింగ్, అతని భార్య ఇద్దరు మద్యానికి బానిసలు. వీరిద్దరూ తరచుగా మద్యం సేవిస్తూ ఉండేవారు. ప్రతి ఒక్క రోజు మద్యం సేవించడం కోసం డబ్బులు లేకపోవడంతో అప్పుడు ఆ భార్య భర్తలు వారి రెండు నెలల కొడుకుని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు.

మధ్యవర్తి ద్వారా మాట్లాడుకొని పిల్లలు లేని నిజాముద్దీన్ అనే వ్యక్తికి భార్య భర్తలు వారికి రెండు నెలల కొడుకును 30 వేల రూపాయలకు అమ్మేశారు. మీరు వేరే మతానికి చెందిన వ్యక్తికి కొడుకును అమ్మడం కుల పెద్దలకు నచ్చకపోవడంతో వారు పెద్ద సంఖ్యలో స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఇద్దరి పై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం రెండు వర్గాలకు సంబంధించిన ది కావడంతో పోలీసు వారు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. చిన్నారిని కొనుకున్న ఆ వ్యక్తి ఆచూకీ తెలుసుకుని అతడిని స్టేషన్ కు పిలిపించారు. ఆ రెండు నెలల చిన్నారిని తిరిగి జగ్తార్ సింగ్ దంపతులకు అప్పగించారు. అనంతరం ఆ భార్యభర్తలిద్దరు పై పోలీస్ కేసు నమోదు చేశారు.