Site icon HashtagU Telugu

Pak Woman: గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన సెక్యూరిటీ గార్డ్.. వైరల్ వీడియో?

Pakistan

Pakistan

సమాజంలో రోజురోజుకీ ఆడవారికి భద్రత కరువవుతోంది. ఆడవారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒకరిపై అత్యాచారాలు, మానసిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కాగా మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలను తీసుకువచ్చినప్పటికీ అవేవీ ఉపయోగం లేకుండా పోయాయి. చట్టాలు కూడా వారిని ఏం చేయలేవు అన్న ధైర్యంతో కామాంధులు రెచ్చిపోయి ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వారిని కొట్టడం తిట్టడం అత్యాచారాలు చేయడం లాంటివి చేస్తున్నారు.

అయితే సాధారణ మహిళలనే కాకుండా గర్భవతిగా ఉన్న మహిళల పట్ల కూడా కామాంధులు, కొంతమంది క్రూర మృగాలు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక గర్భవతిగా ఉన్న మహిళ సెక్యూరిటీ గార్డ్ మాట్లాడుతూ వాదిస్తూ ఉండగా, ఇంతలోనే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ సెక్యూరిటీ గార్డు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. సదరు మహిళ గర్భవతి అన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఆ మహిళపై దాడి చేశాడు. మొదట గర్భవతిగా ఉన్న మహిళను చెంప దెబ్బ కొట్టగా అని ఒక్కసారిగా కిందపడిపోయింది. అప్పుడు ఆ గర్భవతిగా ఉన్న మహిళ పైకి లేవడానికి ప్రయత్నిస్తూ ఉండగా, సదరు సెక్యూరిటీ గార్డు ఆమెను బూటు కాళ్లతో ముఖంపై తన్నాడు.

 

అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తాజాగా పాకిస్తాన్ లోని కరాచీ, గులిస్తాన్ ఎ జోహర్ ప్రాంతంలో జరిగింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటజన్స్ సదరు సెక్యూరిటీ గార్డ్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గర్భవతి అని కూడా చూడకుండా బూటు కాలుతో తగిలినందుకు అతని పై కఠినంగా చర్యలు తీసుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.