Site icon HashtagU Telugu

Pakistan Chief Justice : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కేసు పెట్టేందుకు కమిటీ

Pakistan Chief Justice

Pakistan Chief Justice

ఇమ్రాన్‌ అరెస్టును తప్పుపడుతూ వ్యాఖ్యలు చేసిన పర్యవసానం

పాకిస్తాన్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాచుకున్న రాజకీయ ఘర్షణలు చివరకు అక్కడి సుప్రీంకోర్టునూ తాకాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Pakistan Chief Justice) జస్టిస్ ఉమర్ అతా బందియాల్ కు వ్యతిరేకంగా పాక్ పార్లమెంటు సోమవారం ఓ తీర్మానం చేసింది. సుప్రీంకోర్టులోని ప్రధాన న్యాయమూర్తి (Pakistan Chief Justice)తో పాటు ఇతర జడ్జీల తప్పుడు వ్యవహార శైలిపై అత్యున్నత న్యాయ పర్యవేక్షక సంస్థ “సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్” లో కేసు దాఖలు చేయడానికి ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని పాకిస్తాన్ ఆరోగ్య శాఖ సెక్రటరీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు డాక్టర్ షాజియా సోబియా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని పార్లమెంటులోని దిగువ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

also read : imran bail :ఇమ్రాన్ కు బెయిల్ మంజూరు

ఇమ్రాన్ ఖాన్ సుప్రీం కోర్టుకు గారాల బిడ్డలా..

అల్ ఖాదిర్ ట్రస్ట్‌ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఆర్మీ అరెస్టు చేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ పలు కామెంట్స్ చేశారు . ఇమ్రాన్ అరెస్టు చెల్లదని.. ఆ విధంగా అరెస్టు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఇస్లామాబాద్ హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది. ఇమ్రాన్ కు ఊరట లభించడం పాకిస్తాన్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ (PDM) సంకీర్ణ ప్రభుత్వానికి కొరుకుడు పడలేదు. ఆ సందర్భంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ.. ఇమ్రాన్ ఖాన్ సుప్రీం కోర్టుకు గారాల బిడ్డలా మారాడని ఎద్దేవా చేశారు. ఈనేపథ్యంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై చర్యలు తీసుకోవడం టార్గెట్ గా పార్లమెంటులో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా, పాకిస్తాన్ ప్రస్తుత చట్టం ప్రకారం.. ప్రధానమంత్రి సలహా మేరకు సిట్టింగ్ జడ్జిపై రాష్ట్రపతి కేసు దాఖలు చేయొచ్చు. అయితే ప్రధానమంత్రి ఇచ్చే సలహాపై నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్రపతికి ఉంటుంది.