Brahmastra On Bjp : బీజేపీపై బ్రహ్మాస్త్రం.. విపక్షాల ‘వన్ ఆన్ వన్’ ఫార్ములా

Brahmastra On Bjp : ఒక్క రిజల్ట్.. అన్ని రీజియనల్ పార్టీల మైండ్ సెట్ ను మార్చేసింది. కాంగ్రెస్ పార్టీపై వాళ్ళ ఒపీనియన్ లో ఛేంజ్ ను తీసుకొచ్చింది. ఇప్పటిదాకా "ఔట్ డేటెడ్ " పార్టీ అన్న వాళ్ళే .. ఇప్పుడు "ఔట్ ఆఫ్ ది బాక్స్" పార్టీ అని కాంగ్రెస్ కు కితాబిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - May 17, 2023 / 09:58 PM IST

Brahmastra On Bjp : ఒక్క రిజల్ట్.. అన్ని రీజియనల్ పార్టీల మైండ్ సెట్ ను మార్చేసింది. కాంగ్రెస్ పార్టీపై వాళ్ళ ఒపీనియన్ లో ఛేంజ్ ను తీసుకొచ్చింది. ఇప్పటిదాకా “ఔట్ డేటెడ్ ” పార్టీ అన్న వాళ్ళే .. ఇప్పుడు “ఔట్ ఆఫ్ ది బాక్స్” పార్టీ అని కాంగ్రెస్ కు కితాబిస్తున్నారు. నిన్నమొన్నటి దాకా కాంగ్రెస్ తో దోస్తీ గురించి నోరు విప్పని కొన్ని ప్రాంతీయ పార్టీలు.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్లలో మద్దతిస్తామని బాహాటంగా చెబుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రీజియనల్ పార్టీలు కాంగ్రెస్ తో చేయి కలిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం అనేది .. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుకాబోయే గట్టి పోటీకి బలమైన, స్పష్టమైన సంకేతమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. స్ట్రాంగ్ ప్రధాని క్యాండిడేట్ ను అన్ని విపక్షాలు కలిసి ప్రకటించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈక్రమంలో బీహార్, బెంగాల్ లోని ప్రాంతీయ పార్టీలు ముందడుగు వేశాయని చెప్పొచ్చు. ఆ పార్టీల మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. విపక్షాల ఐక్యతకు సంబంధించిన సందేశాన్ని చాటిచెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల రీజియనల్ పార్టీల నేతలతో దీనిపై చర్చలు కూడా జరుపుతున్నారు.

ALSO READ : Karnataka Polls: కర్ణాటక రిజల్ట్ పై రాహుల్ భవిష్యత్తు?

నితీష్ కుమార్ వరుస భేటీలు..

బీహార్ సీఎం, జనతాదళ్-యునైటెడ్ (జేడీ-యూ) అధినేత నితీష్ కుమార్ ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చెమటోడుస్తున్నారు. ఆయన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తదితరులతో వరుస భేటీలు జరుపుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతోనూ భేటీ అయ్యారు. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా (థర్డ్ ఫ్రంట్) ఏర్పడాలని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒకరిపై మరొకరు పోటీ చేయొద్దు అనే ఫార్మలాతో నితీష్ కుమార్ ముందుకు పోతున్నారు. అయితే కాంగ్రెస్ వైఖరిపై ప్రాంతీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ కూడా ఒక మెట్టు దిగి .. తాము బలంగా ఉన్నచోట మద్దతు ఇవ్వాలని రీజియనల్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అలా అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడి పోరులో కలిసి వస్తామని చెబుతున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ పోటీ చేయకుండా చూడాలని, కాంగ్రెస్ బలంగా ఉన్న 200కు పైగా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు మద్దతిచ్చేట్లు తమ ప్లాన్ లో మార్పులు చేయడంపై ఆలోచిస్తున్నాయి.

ALSO READ : Unite Opposition : విప‌క్ష కూట‌మికి నితీష్ జై, ఢిల్లీలో భేటీ

1977 రిపీట్ అవుతుందా..

ప్రాంతీయ పార్టీల కూటమికి నేతృత్వం వహించేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అంగీకరిస్తే సంతోషిస్తానని నితీష్ కుమార్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకెళ్లేందుకే మొగ్గు చూపుతున్నట్లు కనబడుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత భేషజాలు లేకుండా అన్ని రీజియనల్ పార్టీలతో కలిసి ముందుకు నడుస్తామని ఇటీవల కాంగ్రెస్ కీలక నేత, రాహుల్ గాంధీ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 1977లో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో కూటమిగా ఏర్పడి అధికారాన్ని కైవసం చేసుకున్నట్లే .. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని విపక్షాలు నమ్ముతున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో కాలమే నిర్ణయిస్తుంది.

ALSO READ : Mamata Banerjee : వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా కీల‌క వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్‌కు ష‌ర‌తుల‌తో కూడిన‌..?

నితీష్ ప్రతిపాదనకు మమత ఏమన్నారంటే.. 

నితీష్ కుమార్ ప్రతిపాదించిన ‘వన్-ఆన్-వన్’ ఫార్ములాను మమతా బెనర్జీ అంగీకరించారని జేడీ-యూ సీనియర్ నేత కె.సి.త్యాగి తెలిపారు. కాంగ్రెస్ ను ఇంతకాలం విమర్శించిన మమత.. నితీష్ తో సమావేశం తర్వాత కాంగ్రెస్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారని గుర్తు చేశారు. దీంతో 2024 ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాన్ని మమత విరమించుకున్నట్లు చెప్పారు. బెంగాల్ లో టీఎంసీ, ఢిల్లీలో ఆప్, బిహార్ లో జేడీఎస్, ఆర్జేడీ, తమిళనాడులో డీఎంకే, జార్ఖండ్ లో జేఎంఎం పార్టీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాయని, వాటి అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టాలని, అప్పుడే బీజేపీతో ముఖాముఖి పోటీ సాధ్యమని పేర్కొన్నారు.