Onion Prices: టమాట మాదిరిగా ఉల్లిపాయలు ధరలు కూడా భగ్గుమంటున్నాయి. వర్షాలు ఆలస్యంగా కురవడం వల్ల ఉల్లి పంటలపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో దిగుబడి తగ్గింది. దీని కారణంగా ఉల్లి గడ్డల సరఫరా తక్కువగా ఉందని చెబుతున్నారు. వారంరోజుల క్రితం కిలో రూ.20-25కు విక్రయించిన ఉల్లిగడ్డలను ప్రస్తుతం హైదరాబాద్ లో రూ.40-45 వరకు విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్లలో ఉల్లి ధర రూ. 53కిపైగా ఉంది. గతంలో భారీ వర్షాల కారణంగా జూలైలో టమాట ధర కిలోకు 200 రూపాయలు పలికింది.
అయినప్పటికీ, కొన్ని వారాల తర్వాత తగ్గాయి. అప్పట్లో హైదరాబాద్‌లో టమాటా కొనకుండా జనాలు ఇతర కూరగాయలపై దృష్టి సారించారు. నవంబర్ తర్వాతే ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ధరల పెంపుపై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఉల్లి ధరల పెరుగుదలకు అకాల వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా అక్టోబర్‌లో మంచి వర్షాలు కురుస్తాయి, కానీ ఈ సంవత్సరం దాని జాడ కనిపించలేదు అని రైతులు చెప్తున్నారు. రోజురోజుకూ ఉల్లి ధరలు పెరిగిపోతుండటంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: Y S Sharmila: దిక్కుతోచని స్థితిలో షర్మిల, YSRTPకి అభ్యర్థులు నిల్!