One Chip Challenge: వన్ చిప్ ఛాలెంజ్.. స్పైసీ చిప్స్ తిని బాలుడు మృతి!

అమెరికాలోని మసాచుసెట్స్‌లో 14 ఏళ్ల బాలుడు ఓ ఛాలెంజ్ ను స్వీకరించి అర్ధాంతరంగా చనిపోయాడు.

  • Written By:
  • Updated On - September 5, 2023 / 01:57 PM IST

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొత్త వైరల్ ఛాలెంజ్‌లు కనిపిస్తున్నాయి. ఇందులో చాలావరకు  సవాళ్లు కూడుకున్నవి. కొన్ని ప్రాణాంతకం కూడా. లైక్స్, కామెంట్ల మోజులో పడిన యూత్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో 14 ఏళ్ల బాలుడు ఓ ఛాలెంజ్ ను స్వీకరించి అర్ధాంతరంగా చనిపోయాడు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. బాధితుడు గత వారం ‘వన్ చిప్ ఛాలెంజ్’లో పాల్గొన్నాడు. సోషల్ మీడియా ఛాలెంజ్‌లే  కారణమని బాలుడి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ‘వన్ చిప్ ఛాలెంజ్’లో పాల్గొని స్పైసీ చిప్స్ తినడం వల్ల 10వ తరగతి బాలుడు హఠాత్తుగా మరణించాడని తెలిసింది.

బాధిత బాలుడు పాఠశాలలో చాలా కారంగా వండిన చిప్స్ తిన్నాడని, ఆ తర్వాత అతనికి కడుపు నొప్పి రావడం ప్రారంభించిందని హారిస్ తల్లి చెప్పారు. అయితే హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లిన త‌ర్వాత హారిస్‌కి కొంత కోలుకున్నాడు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ ఆరోగ్యం క్షీణించిందని, మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయిందని తల్లి తెలిపింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం వెల్లడవుతుందని వైద్యులు తెలిపారు.

వన్ చిప్ ఛాలెంజ్‌కు సంబంధించిన కేసులు కూడా గతంలో తెరపైకి వచ్చాయి. గత సంవత్సరం, కాలిఫోర్నియా పాఠశాల జిల్లాకు చెందిన ముగ్గురు హైస్కూల్ విద్యార్థులు వైరల్ “వన్ చిప్ ఛాలెంజ్” ట్రెండ్‌లో పాల్గొని ఆసుపత్రి పాలయ్యారు. అప్పుడు పాఠశాల ప్రిన్సిపాల్ ఆడమ్ ఓర్బాచ్ మీడియాతో మాట్లాడుతూ ఇందులో పాల్గొన్న ప్రతి విద్యార్థి ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు. స్పైసీ చిప్స్ తిన్న తర్వాత, చాలా మంది విద్యార్థులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదు చేశారు. కొంతమంది విద్యార్థులు వాంతులు కూడా చేసుకున్నారు.

Also Read: ED Notice: గ్రానైట్ మెటీరియల్‌ లో అవకతవకలు, మంత్రి గంగుల కుటుంబ సభ్యులకు ‘ఈడీ’ షాక్