Site icon HashtagU Telugu

Sopore : మరోసారి సోపోర్‌ ప్రాంతంలో కాల్పుల మోత

Once again there is a lot of firing in Sopore area

Once again there is a lot of firing in Sopore area

Jammu Kashmir: మరోసారి జమ్మూకశ్మీర్‌లోని సోపోర్ (Sopore) ప్రాంతంలో కాల్పుల మోత మోగుతుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హత్యమయ్యాడు. కాగా.. ఈ సమాచారాన్ని చినార్ కార్ప్స్ శనివారం ‘X’ ద్వారా తెలిపారు. “వాటర్‌గామ్‌లో ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారని చెప్పారు. అప్రమత్తమైన సైనికులు వెంటనే ప్రతీకారం తీర్చుకున్నారు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. అలాగే పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.” అని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా.. సోమవారం తెల్లవారుజామున ఉధంపూర్ జిల్లాలో పెట్రోలింగ్ చేస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) ఇన్‌స్పెక్టర్ మృతి చెందారు. అలాగే.. మధ్యాహ్నం 3.30 గంటలకు బసంత్‌గఢ్‌లోని డూడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్ ప్రాంతంలో CRPF, జమ్మూ కాశ్మీర్ పోలీసుల SOG పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో సీఆర్‌పీఎఫ్ 187వ బెటాలియన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ కులదీప్ కుమార్ చనిపోయాడు.

మరోవైపు.. గత వారం ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించిన నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. సెప్టెంబర్ 18న మొదటి దశలో ఓటింగ్ జరగనున్న కాశ్మీర్‌లోని వివిధ అసెంబ్లీ స్థానాలకు గురువారం ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ), అప్నీ పార్టీ నుంచి ఇద్దరు చొప్పున.. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి కూడా తన నామినేషన్‌ పత్రాన్ని దాఖలు చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి, సీనియర్ ఎన్‌సి నాయకురాలు సకీనా ఇటు కుల్గాం జిల్లాలోని దమ్హాల్ హంజి పోరా నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కశ్మీర్ లోయలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 27 చివరి తేదీ. తొలి దశలో జమ్మూ ప్రాంతంలోని ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరగనుంది.

Read Also: VV Vinayak : డైరెక్టర్ వినాయక్ కు లివర్ సర్జరీ…?