Site icon HashtagU Telugu

Retirement Money: రిటైర్మెంట్ డబ్బుల కోసం 18 ఏళ్లుగా పోరాడుతున్న వృద్ధుడు.. కానీ చివరికి అలా?

Madhya Pradesh

Madhya Pradesh

మధ్యప్రదేశ్ లో తాజాగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ఒక వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వృద్ధుడు పనిచేసిన చోటే అతనికి డబ్బులు రావాల్సి ఉండగా ఆ డబ్బుల కోసం 18 ఏళ్ల పాటు పోరాటం చేశాడు. కానీ అధికారులు అతనిపట్ల కనికరించకపోవడంతో విసుగు చెందిన ఆ వృద్ధుడు సూసైడ్ చేసుకున్నాడు. అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పరిధి ప్రైడ్ సిటీ కటారాహిల్స్‌కు చెందిన ఓంప్రకాష్ భార్గవ అనే 57 ఏళ్ళ వృద్ధుడు 1986 నుంచి అశోక్‌నగర్‌లోని చందేరిలో జల వనరుల శాఖలో పని చేస్తున్నారు.

2003లో అతడి వేతనం రూ.1,882లు ఉండేది. అయితే అతను సదరు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసే రోజువారీ వేతన జీవులకు ప్రభుత్వం రూ.70,000 అందజేస్తుందని అప్పటి గవర్నర్ రామ్ ప్రకాశ్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఓంప్రకాష్ అప్పట్లోనే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు.ఇక అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ డబ్బులు అందలేదు. గతంలో ఎన్నోసార్లు సంబంధిత అధికారులు, రాజకీయ నేతలకు వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.

అలా అతని డబ్బుల కోసం ఆ వృద్ధుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 ఏళ్ల పాటు పోరాటం చేశాడు. దానితో తీవ్ర మనస్థాపానికి గురైన ఓంప్రకాష్ బుధవారం సాయంత్రం నర్మదా భవన్‌కు చేరుకున్నారు. కొద్ది సేపటి తర్వాత సమీపంలోని పొదల్లోకి వెళ్లి, కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై స్పృహతప్పి పడిపోయాడు. అయితే గమనించిన స్థానికులు వేంటనే అంబులెన్స్‌కి, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో వృద్ధుడు లేఖ లో పేర్కొన్న అధికారులు ప్రస్తుతం అక్కడ పని చేయడం లేదని పోలీసులు తెలిపారు.కానీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.