మనదేశంలో క్రికెట్ (Cricket)కు ఉన్న క్రేజ్ వేరు. గల్లీలోనో, స్టేడియాల్లోనో ఈతరం యూత్ క్రికెట్ ఆడుతూ కనిపించే ద్రుశ్యాలు ఎన్నో. ఎవరైనా ఆర్గనైజర్స్ సహకారంతో గేమ్స్ ఆడితే అన్ని రకాల వసతులు సమకూరుతాయి. కానీ అలాంటివేమీ లేనప్పుడు కుర్రాళ్లు తమకు తోచినవిధంగా క్రికెట్ ఆడుతుంటారు. ఈ నేపథ్యంలో ఓ యువకుడు కామెంట్రీ (Commentary) చెప్పడం వైరల్ గా మారుతోంది. ఓలా వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ ఈ వీడియో (Viral Video) షేర్ చేయడంతో ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం ఓలా (Ola) ఎలక్ట్రిక్ స్కూటర్ ను చాలామంది యూజ్ చేస్తున్నారు. దానికి చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి. అయితే అందులోని అడియో సిస్టమ్ ను కామెంట్రీ చేయడానికి మలుచుకున్నాడు యువకుడు. లైవ్ క్రికెట్ జరుగుతుండగా, కామెంటరీ కోసం ఓలాలోని స్పీకర్‌లను ఉపయోగిస్తూ కామెంట్రీ (Commentary) చెప్పడం ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. వాహనానికి వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసినట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ పట్టుకుని ఓ వ్యక్తి ఓలా బైక్ పక్కన నిలబడి కామెంట్రీ (Commentary) ఇవ్వడం వీడియోలో చూడొచ్చు. “మా ఓలా బైక్ ఇలా కూడా యూజ్ అవుతుంది’’ అని ఫౌండర్ చెప్పడం మరింత ఆసక్తిని రేపుతోంది.
This has to be the most creative use of our vehicle I have seen so far 😄👌🏼 https://t.co/QjCuv4wGQG
— Bhavish Aggarwal (@bhash) December 22, 2022
Also Read: Kangana Ranaut: అలాంటి డబ్బు నాకొద్దు.. కంగనా కామెంట్స్!