Djokovic – Sania : సానియాతో కలిసి పనిచేస్తా.. అదే నా లక్ష్యం : జ‌కోవిచ్

Djokovic - Sania : ‘ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024’లో సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నోవాక్ జకోవిచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

  • Written By:
  • Updated On - January 21, 2024 / 03:30 PM IST

Djokovic – Sania : ‘ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024’లో సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నోవాక్ జకోవిచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. టెన్నిస్‌ అభివృద్దికి సానియా మీర్జాతో కలిసి పనిచేస్తాను’’ అని చెప్పాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్‌ అనంతరం సానియా మీర్జాతో కలిసి సోనీ స్పోర్ట్స్‌‌కు జకోవిచ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘‘గతంలో భారత్ నాకు ఇచ్చిన ఆతిథ్యం గుర్తుకొస్తోంది. నేను మరోసారి ఇండియాకు రావాలని అనుకుంటున్నాను.  సెర్బియా, భారత్ చరిత్రను పరిశీలిస్తే చాలా సారూప్యతలు ఉన్నాయి. నాకు ఇండియన్స్ అంటే చాలా ఇష్టం. ఇండియన్స్ నన్ను అభిమానిస్తుంటారు.  భారత్‌లో క్రికెట్‌ ఒక మతంగా ఉన్నప్పటికీ.. టెన్నిస్‌ను కూడా ఆదరిస్తారు’’ అని జకోవిచ్(Djokovic – Sania) చెప్పుకొచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

‘దాదాపు పదేళ్ల క్రితం ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు వెళ్లాను. రెండు రోజులు పాటు న్యూఢిల్లీలో ఉన్నాను. మరోసారి భారత్‌కు రావాలనుకుంటున్నాను. భారత్‌లో పిల్లల అభివృద్ధికి కొన్ని కార్యక్రమాలలో భాగం కావాలని ఆశిస్తున్నా. సేవా కార్యక్రమాలు నా భార్యకు కూడా ఎంతో ఇష్టం. అదే మా ఫౌండేషన్ లక్ష్యం. భారత్‌లో టెన్నిస్‌ అభివృద్దికి సంబంధించిన కార్యక్రమాల్లో నేను భాగం కావాలని అనుకుంటున్నా. పిల్లలు రాకెట్ పట్టుకుని టెన్నిస్ ఆడటం నాకు చాలా ఇష్టం. టెన్నిస్‌ అభివృద్దికి నేను అన్ని విధాలుగా కృషి చేస్తాను. ఈ మిషన్‌ కోసం సానియా మీర్జాతో కలిసి పనిచేస్తా’ అని జకో వెల్లడించాడు.

Also Read: First Satellite Picture : అయోధ్య రామాలయం మొదటి శాటిలైట్ ఫొటో ఇదే..

అద్భుత ఆటతో జకో క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జ‌రిగిన‌ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు అడ్రియ‌న్ మ‌న్నారినోను వ‌రుస సెట్లలో 6-0, 6-0, 6-3తో చిత్తుగా ఓడించాడు. అయితే భారత్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, టెన్నిస్‌ అభివృద్దికి సానియా మీర్జాతో కలిసి పనిచేస్తాని జ‌కోవిచ్ చెప్పాడు. తాను మరోసారి ఇండియాకు రావాలనుకుంటున్నానని జకోవిచ్ తెలిపాడు.