North Korea:ఉత్తర కొరియాలో పేలిన కరోనా బాంబు.. 3 రోజుల్లోనే 8 లక్షల కేసులు

ఉత్తర కొరియాలో కరోనా బాంబు పేలింది. కేవలం గత మూడు రోజుల్లో 8,20,620 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

  • Written By:
  • Publish Date - May 15, 2022 / 05:00 PM IST

ఉత్తర కొరియాలో కరోనా బాంబు పేలింది. కేవలం గత మూడు రోజుల్లో 8,20,620 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,24,550 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొలుత ఈ కొవిడ్ కేసులను అంతు చిక్కని జ్వరాలుగా భావించారు. కానీ కొవిడ్ పరీక్షల నివేదికలు వచ్చాక .. అవి కరోనా ఇన్ఫెక్షన్లే అని తేలింది.

తాజాగా ఆదివారం మరో 15 మంది అంతు చిక్కని ‘జ్వరం’తో చనిపోయారని ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రకటించింది. అవి కూడా కొవిడ్ మరణాలే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. కొవిడ్ మరణాలను దాచే దురుద్దేశంతోనే వాటికి.. అంతుచిక్కని జ్వరాలు అనే పేరు పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఈ జ్వరంతో సంభవించిన మరణాల సంఖ్య 42కు పెరిగింది. ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. ఉత్తర కొరియా లో కేసులు వేగంగా పెరగడానికి ఒమైక్రోన్ లోని కొత్త వేరియంట్లు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.