ఒక దేశాధ్యక్షుడు దేశ ప్రజలను నవ్వొద్దని ఎక్కడైనా చెప్తాడా? ఒక దేశాధ్యక్షుడు శుభకార్యాలు జరపకూడదని ఎక్కడైనా ఆదేశాలు జారీ చేస్తాడా? లేదు కదా.. కానీ.. అక్కడ మాత్రం ఇలానే జరుగుతుంది. యస్.. మీరు వింటున్నది నిజమే.. ఆ దేశంలో కనీసం నవ్వకూడదట. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ అరాచకాలు తారా స్ధాయికి చేరాయి.
ఉత్తర కొరియా మరోసారి తనదైన శైలిలో ప్రజలపై నియంతృత్వ ఆంక్షలు విధించింది. దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ తండ్రి, ఉత్తరకొరియా మాజీ అధినేత అయిన కిమ్ జాంగ్ చనిపోయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూఉండాలని ఈ క్రమంలో ‘‘ప్రజలెవ్వరు నవ్వకూడదని..మద్యం సేవించి ఖుషీగా ఉండకూడదని కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ జాంగ్ కు ప్రజలంత 11 రోజుల సంతాప దినాలు పాటించాల్సిందిగా ఆర్డర్ పాస్ చేశాడు.
సంతాప దినాలుగా పాటించే ఆ 11 రోజులు దేశంలో ఎవ్వరూ సంతోషంగా ఉండకూడదని..నవ్వకూడదని..మద్యం సేవించకూడదని హుకుం జారీచేశారు కిమ్ఈ. 11 రోజులు ప్రజలు కనీసం నవ్వినా..ఆల్కహాల్ సేవించినా..కఠిన శిక్షలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ ఆంక్షలు ఎంతగా ఉన్నాయంటే..దేశంలో ఎవ్వరు సంతోషకరమైన కార్యక్రమాలు చేసుకోకూడదు..పిల్లలు పుట్టిన రోజులు కూడా చేసుకోకూడదని నిబంధనలు విధించారు.
అంతేకాదు..డిసెంబర్ 17న కిమ్ జాంగ్ 10వ వర్థంతి సందర్భంగా ఉత్తర కొరియా వాసులు ఎవ్వరూ ఆ రోజున నిత్యవసర వస్తువులు కూడా కొనుక్కోకూడదని..కిమ్ జాంగ్ రూల్ పాస్ చేశాడు. అక్కడితో ఆగలేదు వీరి నియంతత్వ పోకడలు..ఈ 11 రోజుల సంతాప దినాల సమయంలో ఎవరి ఇంట్లోనైనా వారి కుటుంబసభ్యులు గానీ..బంధువులు, ఆత్మీయులు చనిపోయినా ఏడవకూడదు. ఎవ్వరింట్లోను శుభకార్యలు జరుపుకోకూడదు. కనీసం పిల్లల పుట్టిన రోజు వేడుకలు చేసుకోకూడదట.

