Site icon HashtagU Telugu

Baba Vanga’s predictions : ‘వార్’ వ‌న్ సైడ్ చేసిన ‘బాబా వాంగ’

Baba Vanga

Baba Vanga

ఉక్రెయిన్‌, ర‌ష్యా యుద్ధంపై కాల‌జ్ఞానిగా పేరుగాంచిన బాబా వాంగ కొన్ని వంద‌ల ఏళ్ల క్రిత‌మే చెప్పింద‌ట‌.. ర‌ష్యా మ‌హోజ్వ‌లంగా వెలిగిపోతుంద‌ని రాసిన జోస్యం వెలుచూస్తోంది. అంతేకాదు, యూర‌ప్ ఖండం ఒక బంజ‌రు భూమిగా మారిపోతుంద‌ని కాలంజ్ఞానం చెబుతోంది. బాబా వాంగ‌ చెప్పిన దాని ప్ర‌కారం ఉక్రెయిన్ పై ర‌ష్యా విజ‌యం సాధించ‌బోతుంది. 1996లో కన్నుమూసిన బాబా వాంగ‌ చెప్పినవ‌న్నీ జ‌రిగాయ‌ని ప్ర‌పంచ దేశాల్లోని అత్య‌ధిక ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బాబా వంగా చెప్పిన వాటిపై సెర్చ్ చేస్తున్నారు. చాలా వ‌ర‌కు ఆనాడు కాల‌జ్ఞానిగా బాబా వాంగ‌ చెప్పిన‌వి జ‌రిగాయ‌ని నిర్థార‌ణ‌కు వ‌స్తున్నారు. అందుకే, ర‌ష్యా గెలుపు త‌థ్య‌మ‌ని భావిస్తున్నారు.
బాబా వాంగ బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఆవిడ జోస్యం చాలా సందర్భాలలో నిజమైనది. బాబా వాంగ బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చెప్పించుకునేవారట‌.

ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్ట్రడామస్ కన్నా ఖ‌చ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేసింద‌ట‌. ఆమె 1996లో తన 85వ ఏట చనిపోయారు. ఇప్పుడు చెబుతున్నవన్నీ ఆమె అంతకుముందే అంచనావేసినవి. తన చిన్నప్పుడు వచ్చిన ఓ భయంకర పెనుతుపానులో చిక్కుకుని కళ్లు పోగొట్టుకున్న బాబా వాంగ దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను వీక్షించారని ప్రతీతి. రెండు లోహ విహంగాలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని బాబా వాంగ 1989లో చెప్పింది. ఆ మేర‌కు 2001, సెప్టెంబరు 11న అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడిని ఆమె అనుచర వర్గాలు పేర్కొన్నాయి. అలాగే 1950లో సముద్రపు అలలు భూభాగాన్ని కబళించివేస్తాయని చెప్పారు. ఆ ప్ర‌కారం 2004, డిసెంబరు 26వ తేదీన ఇండోనేసియా, సుమిత్ర దీవులను సునామీ కుదిపేసిందని ఆ వర్గాలు అన్నాయి. క్రిస్మస్ రోజుల్లో వచ్చిన ఆ సునామీని బాక్సింగ్ డే సునామీ అని కూడా వ్యవహరిస్తున్నారు.

భూమండలంపై వచ్చే పెను వాతావరణ మార్పుల గురించి కూడా ఆమె 60 ఏళ్ల క్రితమే ఊహించారు. ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగిపోతాయని చెప్పింది. ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగిపోతాయని, వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయని, అగ్ని పర్వతాలు బుసలకొడతాయని ఆమె చెప్పిన జోస్యం. అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్-అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని కూడా బాబా వాంగ అంచనా వేసినట్టు అనుచర వర్గాలు చెబుతూ వస్తున్నాయి. 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నికయ్యాడు. కానీ ఆయన తర్వాత 2017 లో డోనాల్డ్ ట్ర౦ప్ ఎన్నికయ్యారు. 2130 నాటికల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలకుండా నశించి పోతుందని చెప్పింది. అంతరిక్షవాసుల సహకారంతో సముద్ర గర్భంలో మానవులు జీవిస్తారని వాంగ అంచనా వేసింది. 3005 నాటికి అంగారక గ్రహంపై కూడా యుద్ధం జరుగుతుందని, 3,797 నాటికి ఈ భూమండలమంతా నశించి పోతుందని కాల‌జ్ఞానంలో పేర్కొంది. అప్పటికీ భూమి మీద మిగిలిన మానవులు మరో సౌర వ్యవస్థలోకి వెళ్లిపోతారని కూడా ఆమె అంచనా వేసింది.

పుతిన్ మరింత శక్తిమంతుడు అవుతాడని బ‌ల్గేరియాకు చెందిన బాబా వంగా ఆనాడే చెప్పేసింద‌ట‌. ఆమె ఓ కాలజ్ఞానిగా యూరప్ దేశాల్లో గుర్తింపు పొందారు. ఆమె ఇప్పుడు లేరు. 1996లోనే పరమపదించారు. బాబా వంగాను బల్గేరియా దైవదూతగా అని పిలుస్తుంటారు. ఆమె అసలు పేరు వంగేలియా పాండేవా గుష్టెరోవా. 1911లో బల్గేరియాలో జన్మించింది. అయితే, తన పన్నెండవ ఏట కంటిచూపు కోల్పోయింది. అయితే, తన ఎదుట నిలబడిన వారి వివరాలను, భవిష్యత్తును కచ్చితంగా చెప్పేదని, ఆమె చెప్పిన వాటిలో అత్యధిక శాతం నిజమయ్యాయని యూరప్ దేశాల ప్రజలు విశ్వసిస్తారు. అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికా ట్రేడ్ సెంటర్ పై దాడి చేస్తారని బాబా వంగా ముందే చెప్పారని, ఈయూ నుంచి పలు దేశాలు తప్పుకుంటాయని ఆమె చెప్పిన విషయాలు నిజమయ్యాయని యూరప్ దేశాల్లో ప్రచారంలో ఉంది. ఇక, ఉక్రెయిన్ ప్రస్తుత పరిస్థితిని బాబా వంగా ఆనాడే ఊహించారట. రష్యా దాడి నుంచి ఉక్రెయిన్ తప్పించుకోవడం అసాధ్యం అని, రష్యా ప్రపంచాధిపత్యం వహించడమే కాకుండా, వ్లాదిమిర్ పుతిన్ సర్వశక్తిమంతుడు అవుతాడని ఆ కాలజ్ఞాని చెప్పారు. యూరప్ ఖండం ఒక బంజరు భూమిలా మారిపోతుందని, రష్యా మాత్రం మహోజ్వలంగా వెలిగిపోతుందని ఆమె సెలవిచ్చారు. ఇప్పుడు బాబా వాంగ చెప్పిన కాల‌జ్ఞానం ప్ర‌కారం ఉక్రెయిన్ పై ర‌ష్యా గెల‌వ‌డమే కాదు, మ‌హోజ్వ‌లంగా వెలిగిపోతుంద‌ట‌. అంటే, ఉక్రెయిన్ తో ర‌ష్యా ఆగ‌ద‌ని బాబా వాంగ చెప్పిన జోస్యంలోని ఆంత‌ర్యం. సో..యుద్ధాలు యూర‌ప్ దేశాల్లో ఇప్ప‌ట్లో ఆగే అవ‌కాశాలు ఆమె చెప్పిన జోస్యం ప్ర‌కారం లేద‌న్న‌మాట‌.