Dead Body In Bag : బ్యాగ్ లో పసికందు శవంతో.. తండ్రి బస్సు ప్రయాణం

అమానుష ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. అంబులెన్స్ కు ఇచ్చేందుకు డబ్బులు లేక ఓ తండ్రి తన కొడుకు డెడ్ బాడీని బ్యాగ్ లో(Dead Body In Bag) దాచి 200 కిలోమీటర్ల దూరం బస్సులో తీసుకెళ్ళాడు.

Published By: HashtagU Telugu Desk
Dead Body In Bag

Dead Body In Bag

అమానుష ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. అంబులెన్స్ కు ఇచ్చేందుకు డబ్బులు లేక ఓ తండ్రి తన కొడుకు డెడ్ బాడీని బ్యాగ్ లో(Dead Body In Bag) దాచి 200 కిలోమీటర్ల దూరం బస్సులో తీసుకెళ్ళాడు. ఉత్తర దినాజపూర్ జిల్లా కలియాగంజ్ ప్రాంతానికి చెందిన రోజుకూలీ అసిమ్ దేవశర్మ ఎదుర్కొన్న ఈ దుస్థితి గురించి పూర్తి వివరాలు ఇవీ.. అసిమ్ దేవశర్మ కు 5 నెలల వయసున్న ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వీరిద్దరికి ఆరోగ్య సమస్య రావడంతో కలియాగంజ్ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయించాడు. అయినా సీరియస్ కావడంతో చిన్నారులను సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ దవాఖానకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్సపొందాక కవలల్లో ఒకరి ఆరోగ్యం మెరుగు పడింది. ఆ బిడ్డను తన భార్యతో పాటు ఇంటికి పంపించాడు.

ALSO READ : Raping Dead Girls: చనిపోయిన మహిళలను కూడా వదలని నీచ కామాంధులు.. ఏకంగా సమాధులు తవ్వి మరి అత్యాచారాలు?

అంబులెన్స్ కు ఫోన్ చేస్తే..

మరో కుమారుడు చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు. కుమారుడి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ కు ఫోన్ చేస్తే రూ.8 వేలు కావాలని డ్రైవర్ అడిగాడు. అంత డబ్బు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్న దేవశర్మ.. కుమారుడి మృతదేహాన్ని బస్సులోకి ఎక్కించుకొని బయలుదేరాడు. తోటి ప్రయాణికులు అభ్యంతరం చెబుతారని.. శవాన్ని బ్యాగులో(Dead Body In Bag) పెట్టుకొని కూర్చున్నాడు. ఊరికి దగ్గర్లో ఉన్న టౌన్ లో బస్సు దిగాక తక్కువ రేటుకు ఒక అంబులెన్స్ మాట్లాడుకొని ఇంటికి కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్ళాడు.

  Last Updated: 15 May 2023, 03:46 PM IST