నిన్నటి వరకు బెంగుళూర్ వాసులు ఎంత టెన్షన్ గా ఉన్నారో ..తెలియంది కాదు. దీనికి కారణం కుక్క మాంసం తింటున్నామనే ప్రచారం. బెంగుళూర్ నగరంలో చాల రెస్టారెంట్స్ కు అలాగే మటన్ షాప్స్ కు రాజస్థాన్ నుండి కుక్క మాంసాన్ని (Dogs Meat) సరఫరా చేస్తున్నారనే వార్త బెంగుళూర్ (Bangalore) నగరవాసులను షాక్ లో పడేసింది. కేఎస్సార్ రైల్వే స్టేషన్ లో భారీగా మాంసం పట్టుబడింది. అది కుక్క మాంసం అంటూ అక్కడకు చేరుకున్న యాక్టివిస్టులు గోల చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రావాలని.. దానిని టెస్ట్ చేయించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు..ఆ మటన్ ను ల్యాబ్ కు తరలించారు. దీనికి సంబదించిన రిపోర్ట్ వచ్చింది. ఆ టెస్టుల్లో అది కుక్క మాంసం కాదని తేలింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు. ‘కేఎస్సార్ రైల్వే స్టేషన్ లో తీసుకున్న శాంపిల్స్ ని ల్యాబ్ లో టెస్ట్ చేయించాం. అందులో ఎలాంటి కుక్క మాంసం కలవలేదు అని స్పష్టమైంది. అది సిరోహి అనే ఒక స్పెషల్ బ్రీడ్ మాంసం. ఈ జాతి మేకలకు ఒంటిమీద మచ్చలు ఉంటాయి. తోక కూడా సాధారణం కంటే కాస్త పొడవుగా ఉంటుంది. ఈ రకం మేకలు రాజస్థాన్, కచ్, భుజ్ ప్రాంతాల్లో బాగా పాపులర్. బెంగళూరులో మటన్ కు ఉన్న డిమాండ్ కి తగ్గట్లు వ్యాపారం చేసుకునేందుకు కొందరు డీలర్స్.. కొంతకాలంగా ఈ సిరోహి మాంసాన్ని రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు’ అంటూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు.
Read Also : RajaSaab Glimpse : ప్రభాస్ రాజాసాబ్ గ్లింప్స్.. పూలతో తనకు తానే దిష్టి తీసుకున్న రెబల్ స్టార్