Site icon HashtagU Telugu

Twitter – 1 Dollar – 1 Year : సంవత్సరానికి 1 డాలర్.. ట్విట్టర్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్

Elon Musk Returns

Elon Musk Returns

Twitter – 1 Dollar – 1 Year : ట్విట్టర్ (ఎక్స్) నుంచి ఆదాయాన్ని సంపాదించడంపై  ఎలాన్ మస్క్ ఫోకస్ పెట్టారు. ఈ దిశగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ దేశాలలో కొత్తగా ట్విట్టర్ అకౌంట్ ను తెరిచే వారు కంటెంట్ ను పోస్ట్ చేయడానికి సంవత్సరానికి 1 డాలర్ చొప్పున ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ‘మాకు సపోర్ట్ చేయండి’ అంటూ ఈమేరకు ట్విట్టర్ (ఎక్స్) ఒక పోస్ట్ ను ఇవాళ తెల్లవారుజామున పోస్ట్ చేసింది. ఆ దేశాల్లో కొత్తగా ట్విట్టర్ అకౌంట్స్ ను తెరిచే వారి నుంచి  వార్షిక ఛార్జీలను వసూలు చేసే ఈ సబ్ స్క్రిప్షన్ ప్రోగ్రామ్ కు ‘నాట్ ఎ బాట్’ అని పేరు పెట్టామని వెల్లడించింది. ఇప్పటికే ట్విట్టర్ ప్లాట్ ఫామ్ పై ఉన్నవారి నుంచి ఛార్జీలు వసూలు చేయబోమని తేల్చి చెప్పింది.

We’re now on WhatsApp. Click to Join.

స్పామ్ అకౌంట్లను తగ్గించడానికి, బాట్ అకౌంట్లను తొలగించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నామని తేల్చి చెప్పింది. కేవలం 1 డాలర్ వార్షిక ఫీజుతో అనవసర అకౌంట్లు ట్విట్టర్ లో క్రియేట్ కాకుండా చేయగలుగుతామని ట్విట్టర్ (ఎక్స్) అంటోంది.  ఈ పేమెంట్ చేశాకే.. కంటెంట్ పోస్ట్ చేసే సెక్షన్ యాక్టివేట్ అవుతుందని వివరించింది. ఒకవేళ సంవత్సరానికి 1 డాలర్ సబ్ స్క్రిప్షన్ తీసుకోకుంటే.. కేవలం ట్వీట్లను చదవవచ్చని తెలిపింది.అయితే ఈ ఏడాది చివరికల్లా మరిన్ని దేశాల్లో ఇదే తరహా సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను ట్విట్టర్ ప్రవేశ పెట్టే అవకాశం ఉందనే అంచనాలు (Twitter – 1 Dollar – 1 Year) వెలువడుతున్నాయి.

Also Read: BJP First List : 50 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్.. జాబితాలో ప్రముఖ నేతల పేర్లు ?