New Stone Age – Lancohills : నిత్యం పురావస్తు పరిశోధనల్లో బిజీగా ఉండే ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా.ఈమని శివనాగిరెడ్డి మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఆయన హైదరాబాద్ ల్యాంకోహిల్స్ సమీపంలో కొత్త రాతియుగపు ఆనవాళ్లను గుర్తించారు. సిటీలోని రాక్ ఫార్మేషన్‌ల వద్ద ఆది మానవుని అడుగుజాడలను అన్వేషిస్తున్న క్రమంలో ల్యాంకోహిల్స్ పరిసరాల్లోని మెహర్‌బాబా అనంత పద్మనాభస్వామి కొండపై ఈవిషయాన్ని గుర్తించానని ఆయన వెల్లడించారు.
Also read : Rain Alert Today : మూడు రోజులు వర్షాలు.. తెలంగాణ, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్
కొత్త రాతి యుగానికి చెందిన ఆదిమానవులు రాతి గొడ్డళ్లను పదును పెట్టుకునేందుకు వాడిన రాళ్ల కుప్ప ఒకటి బయటపడిందని తెలిపారు. మెహర్‌బాబా గుహకు ఎగువన 50 మీటర్ల దూరంలో 4 చోట్ల రాళ్లకుప్పలు ఉన్నట్లు వెల్లడైందన్నారు. ఇవి 6వేల ఏళ్ల కిందటివని (New Stone Age – Lancohills) శివనాగిరెడ్డి అంచనా వేశారు. పద్మనాభస్వామి ఆలయ దారికి ఇరువైపులా ఉన్న బండల కింద ఆది మానవులు బతికేవారని చెప్పారు. ఈ ఆధారాలను కాపాడాలని ఆలయ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.
Also read : One Nation One Election : మినీ జమిలి ఎన్నికలకు సన్నాహాలు ? స్పెషల్ పార్లమెంట్ సెషన్ అందుకోసమేనా ?