New Ration Carts : ఎన్నికల కోడ్‌ అమలులో లేని జిల్లాల్లో కొత్త రేషన్‌ కార్డులు : సీఎం రేవంత్‌ ఆదేశం

ఇందులో కొత్త వారితో పాటు కార్డులు ఉన్నవారు సైతం కొత్తగా సభ్యులను చేర్చేందుకు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.

Published By: HashtagU Telugu Desk
New ration cards in districts where election code is not in force: CM Revanth's order

New ration cards in districts where election code is not in force: CM Revanth's order

New Ration Carts : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు పౌరసరఫరాల శాఖ అధికారులతో జరిపిన సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున.. ఈ కోడ్‌ అమలులో లేని జిల్లాల్లో వెంటనే రేషన్‌ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. కొత్త రేషన్‌ కార్డుల జారీకి వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Read Also: Kavitha Special Focus Siddipet : హరీష్ రావు సీటుకే ఎసరు పెట్టిన కవిత..?

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొత్త వారితో పాటు కార్డులు ఉన్నవారు సైతం కొత్తగా సభ్యులను చేర్చేందుకు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.

కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. తొమ్మిదేళ్లు ఆశలతో ఎదురుచూశారు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్‌ కార్డులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో లబ్ధిదారుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. తొలుత ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత నిర్వహించిన గ్రామసభల్లో పేర్లు రాని వారు ఇప్పుడు మీసేవ కేంద్రాల్లో అప్లై చేస్తున్నారు.

Read Also: UNO : 2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు: ఐరాస అంచనా

  Last Updated: 17 Feb 2025, 05:18 PM IST