Site icon HashtagU Telugu

New Parliament Carpet : లోక్ సభ లో గ్రీన్ కార్పెట్.. రాజ్యసభలో రెడ్ కార్పెట్.. ఎందుకు?

New Parliament Carpet

New Parliament Carpet

కొత్త పార్లమెంట్ భవనంలో వేసిన కార్పెట్స్ (New Parliament Carpet) చాలా స్పెషల్. లోక్‌సభ, రాజ్యసభల భవనాల్లో 17,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో చెరొక భారీ కార్పెట్స్ వేశారు. వీటిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 900 మంది నేత కళాకారులు 10 లక్షల గంటలు పనిచేసి అల్లారు. లోక్‌సభ, రాజ్యసభల కోసం  చెరో 150 చిన్న కార్పెట్‌లను రూపొందించారు. వాటికి జాయింట్స్ వేసి.. రెండు భారీ కార్పెట్స్ గా మార్చేసి లోక్‌సభ, రాజ్యసభల భవనాల్లో పరిచారు. లోక్ సభ కోసం గ్రీన్ కలర్ కార్పెట్ .. రాజ్యసభ కోసం రెడ్ కలర్ కార్పెట్ తయారు చేశారు. దీన్ని తయారు చేసిన  నేత కళాకారులంతా ఉత్తరప్రదేశ్‌లోని భదోహి, మీర్జాపూర్ జిల్లాలకు చెందినవారు.

Also read :New Parliament Photos : కొత్త పార్లమెంట్ అదుర్స్.. ఓ లుక్కేయండి

2020లో కార్పెట్స్ (New Parliament Carpet) తయారీ వర్క్ ను స్టార్ట్ చేసి..  2022 మే నాటికి పూర్తి చేశారు. కార్పెట్లను లోక్‌సభ, రాజ్యసభల భవనాల్లో వేసే ప్రక్రియ  2022 నవంబర్ లో ప్రారంభమైంది. ఒక్కో కార్పెట్‌  ను  ప్రతి చదరపుకు అంగుళానికి  120 కుట్లతో నేశారు. మొత్తం 600 మిలియన్ల అల్లికలను నేశారు. లోక్ సభ, రాజ్య సభ కార్పెట్లపై జాతీయ పక్షి నెమలి, జాతీయ పుష్పం కమలం బొమ్మల్ని అద్బుతంగా తీర్చిదిద్దారు.

కార్పెట్ రంగుల వెనుక..

లోక్‌సభ, రాజ్యసభ.. ఈ రెండిటికీ భిన్న‌మైన ప్ర‌త్యేక‌త ఉంది. వీటిలో మెంబర్స్ ను ఎన్నుకునే ప్ర‌క్రియ‌లోనూ తేడా ఉంది. లోక్‌స‌భ‌లోని స‌భ్యులను ప్ర‌జ‌లు నేరుగా ఎన్నుకుంటారు. రాజ్య‌స‌భ సభ్యులను ప్ర‌జా ప్ర‌తినిధులు ఎన్నుకుంటారు. లోక్‌స‌భ స‌భ్యులంతా ప్ర‌జ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తారు. వీరికి భూమితో ఉన్నసంబంధానికి గుర్తుగా  లోక్‌స‌భ‌లో ప‌చ్చ‌రంగు కార్పెట్ వేశారు. ఎరుపు రంగును గౌర‌వానికి ప్ర‌తీక‌గా భావిస్తారు. రాజ్య‌స‌భ‌లోని ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ప్ర‌త్యేక స‌భ్యులుగా గుర్తిస్తారు. అందుకే రాజ్య‌స‌భ‌లో ఎరుపురంగు కార్పెట్‌ను వేశారు.