New Parliament Unveiled : కొత్త పార్లమెంట్.. కొత్త ఉదయానికి సాక్షి : మోడీ Pasha Published Time : 28 May 2023, 03:25 PM New Parliament Unveiled New Parliament Unveiled : కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ ప్రజాస్వామ్య ఆలయాన్ని జాతికి అంకితం ఇచ్చారు. కొత్త పార్లమెంట్ భవనం కొత్త ఉదయానికి సాక్షిగా నిలుస్తుందని ఆయన చెప్పారు. తాను కొత్త లోక్సభ ఛాంబర్లో ఏర్పాటు చేసిన చారిత్రక రాజదండం ‘సెంగోల్’.. ఒకప్పుడు చోళ సామ్రాజ్యంలో జాతీయవాదానికి చిహ్నంగా ఉండేదన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ఒక కాంక్రీట్ కాంప్లెక్స్ మాత్రమే కాదని.. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారతదేశం ముందుకు సాగుతున్నదని.. ఆ అభివృద్ధి ప్రయాణంలో ఒక భాగమే కొత్త పార్లమెంటు (New Parliament Unveiled) భవనమన్నారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ కు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. 2047 నాటికి వికసిత భారత్ ను సాధించాలనే లక్ష్యానికి కొత్త పార్లమెంట్ ఒక సాక్షిగా నిలుస్తుందని పేర్కొన్నారు. Also read : Pm Modi – Ntr : ఎన్టీఆర్ పై మోడీ “మన్ కీ బాత్”.. ఏమన్నారంటే ఎంపీల సంఖ్య పెరిగినప్పుడు.. ఎక్కడ కూర్చుంటారు? తనను ఆశీర్వదించిన ఆదీనం సాధువులకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పవిత్ర ‘సెంగోల్’ వైభవాన్ని పునరుద్ధరించడం తనకు దక్కిన అదృష్టంగా అభివర్ణించారు. ఈ ‘సెంగోల్’ రాజదండం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం వల్ల 60,000 మంది కార్మికులకు ఉపాధి లభించిందని, ప్రత్యేకంగా నిర్మించిన డిజిటల్ గ్యాలరీని వారికి అంకితం ఇచ్చామని ప్రధాని చెప్పారు.”భవిష్యత్తులో ఎంపీల సంఖ్య పెరిగినప్పుడు.. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? అందుకే ఇప్పుడు కొత్త పార్లమెంటు భవనాన్ని కట్టించాం” అని ప్రధాని మోదీ స్పష్టము చేశారు.