Site icon HashtagU Telugu

Horse Chasing Bus: బస్సు కోసం పరుగెత్తిన గుర్రం.. ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న వీడియో!

Horse

Horse

ఓ గుర్రం మరో గుర్రాన్ని తల్లిగా భావించి బస్సు వెనుక పరుగెత్తుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నెటిజన్ల హృదయాలను హత్తుకుంటుంది. హృదయాన్ని కదిలించే ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులోని పేరూర్‌లో చోటుచేసుకుంది. ఇది తల్లి, బిడ్డ బంధానికి అసలైన నిర్వచనంలా మారింది.

ఓ గుర్రం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అయితే అదే సమయంలో అటువైపు ఓ బస్సు వచ్చి ఆగింది. అయితే బస్సుపై గుర్రం బొమ్మను గమనించింది అసలైన గుర్రం. అలాగే చూస్తు ఉండిపోయింది. అయితే బస్సు ముందుకు వేగంగా కదులుతున్నప్పటికీ, రియల్ గుర్రం మాత్రం బస్సు వెనుకాలే పరిగెడుతోంది. తన తల్లి భావించి బస్సు ను ఫాలో కావడం అందర్నీ ఆకట్టుకుంది. నెటిజన్స్ మనసును దోచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్‌గా మారి సంచలనం సృష్టిస్తోంది.