Site icon HashtagU Telugu

Nepal : అవిశ్వాస పరీక్షలో నేపాల్‌ ప్రధాని ప్రచండ ఓటమి

Nepal Prime Minister Pracha

Nepal Prime Minister Prachanda failed in the no-confidence test

Pushpa Kamal Dahal Prachanda: ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రస్తుత ప్రధాని పుష్పకమల్‌ దహల్ ప్రచండ ఓటమిపాలయ్యారు. ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలవగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. 275 సీట్లు కలిగిన నేపాల్‌ పార్లమోంట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజార్టీ అవసరం. మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలి నేతృత్వంలోని పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయినట్లయ్యింది. నేపాల్‌ ప్రధానిగా డిసెంబర్‌ 25, 2022లో పుష్ప కమల్‌ దహల్‌ ‘ప్రచండ’ బాధ్యతలు చేపట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

మాజీ ప్రధాని ఓటీ నేనేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రచండ ఇప్పటికే మూడుసార్లు అవిశ్వాసం ఎదుర్కొన్నారు. అయితే, నేపాలీ కాంగ్రెస్‌తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ, అందుకు ప్రచండ నిరాకరించడంతో అవిశ్వాసం అనివార్యమైంది. నేపాలీ కాంగ్రెస్‌ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, సీపీఎన్‌-యుఎంఎల్‌కు 78 మంది సభ్యుల బలం ఉంది. వీరిద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. తదుపరి ప్రధానిగా ఓలి బాధ్యతలు చేపట్టేందుకు నేపాలీ కాంగ్రెస్‌ ఇప్పటికే అంగీకరించినట్లు సమాచారం. మొత్తంగా నేపాల్‌లో గడిచిన పదహారేళ్లలో 13 ప్రభుత్వాలు మారడం అక్కడి రాజకీయ అస్థిరతకు నిదర్శనం.

కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 క్లాజ్ 2 ప్రకారం, కొత్త ప్రభుత్వం కోసం దావా వేయడానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తారని స్పీకర్ ఘిమిరే ఇప్పుడు రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్‌కు తెలియజేస్తారు. ఇది NC మరియు CPN-UML కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేస్తుంది.

Read Also: Relationship Tips : రిలేషన్‌షిప్‌లో ప్రేమే కాదు.. గొడవలు మధురమే.. ఎందుకంటే..?