Naxalism : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి నక్సలిజం మాట్లాడుతూ..కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 నుంచి ఆరుకు పరిమితమైనట్లు పేర్కొన్నారు. దీంతో మనం మరో మైలు రాయిని చేరుకున్నామన్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి నక్సలిజాన్ని పూర్తిగా పెకిలించివేస్తామని పునరుద్ఘాటించారు. దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారని ఇందులో భాగంగా సురక్షిత భారత్‌ను నిర్మించడానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు. హోంమంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికల ప్రకారం.. దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 ఉన్నాయి. నివేదికల ప్రకారం..2015లో ఇవి 35 ఉండగా..2018 నాటికి 30కి తగ్గాయి. 2021నాటికి 25కు వచ్చాయి. తాజాగా భద్రతా దళాలు చేపడుతున్న వరుస దాడుల వల్ల ఇవి 6కు చేరాయి.
Read Also: Sanjay : ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సోమవారం భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. తాజా ఘటనతో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో 135 మంది మావోయిస్టులు భద్రతా సిబ్బంది కాల్పుల్లో చనిపోయారు. ఇందులో 119 మంది ఒక్క బస్తర్ డివిజన్‌లోనే మరణించినట్లు అధికారులు తెలిపారు. గత శనివారం సుక్మా, బీజాపుర్‌లో జరిగిన రెండు ఘటనల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో వైపు సోమవారం 50మంది మావోయిస్టులు తాము లొంగిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also: Court : ‘కోర్ట్’ ఓటీటీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!