Site icon HashtagU Telugu

National Chicken Wings Day : “చికెన్ వింగ్స్ డే” నేడే.. రెసిపీ ఇలా రెడీ!

National Chicken Wings Day

National Chicken Wings Day

National Chicken Wings Day : ఇవాళ చికెన్ వింగ్స్ డే.. 

చికెన్ వింగ్స్ అంటే కోడి రెక్కలు.. 

కోడి రెక్కలను డీప్ ఫ్రై చేసుకొని తినే ట్రెండ్ 1964లో అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న బఫెలో యాంకర్ బార్‌లో మొదలైంది..   

అయితే దీన్ని మెనూలోకి చేర్చడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.. 

ఆ రోజు బఫెలోస్ యాంకర్ బార్ లో కోడి రెక్కలు ఎక్కువగా మిగిలాయి.  దీంతో ఆ బార్ యజమాని తెరెసా బెల్లిస్సిమో కోడి రెక్కలతో కొత్త కర్రీని వండారు.  అది చాలా స్పైసీగా, టేస్టీగా ఉండటంతో  బార్ యజమాని కొడుకు, ఫ్రెండ్స్ కలిసి లొట్టలేస్తూ తిన్నారు. దీంతో చికెన్ వింగ్స్ ను బార్ యొక్క ఫుడ్ మెనూలో చేర్చాలనే ఐడియా వచ్చింది.  

1977 నుంచి ప్రతి సంవత్సరం జూలై 29న చికెన్ వింగ్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.  

Also read : Vijayawada – Hyderabad : మున్నేరు వ‌ద్ద త‌గ్గిన వ‌ర‌ద‌.. విజ‌య‌వాడ‌- హైదార‌బాద్ హైవేపై రాక‌పోక‌ల‌కు లైన్‌ క్లియ‌ర్‌

చికెన్ వింగ్ లో 3 భాగాలు

చికెన్ వింగ్ కర్రీని వండేందుకు రెడీ కండి. చికెన్ రెక్కను ఎలా కత్తిరించాలో తెలుసుకునే ముందు.. మీరు మొదట దాని అనాటమీ గురించి తెలుసుకోవాలి. చికెన్ రెక్కను విస్తరించి చూస్తే అందులో 3 భాగాలు కనిపిస్తాయి. వాటిని డ్రుమెట్, వింగెట్, వింగ్ టిప్ అంటారు.  డ్రుమెట్‌లు, వింగెట్‌లను సాధారణంగా చాలా చికెన్ వింగ్స్ వంటకాల్లో ఉపయోగిస్తారు. మీరు మీ వ్యక్తిగత ప్రాధాన్యతను బట్టి వీటిని ఆయా షేప్ లలో కట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు.

డ్రుమెట్ (DRUMETTE) 

డ్రుమెట్‌లు చూడటానికి చిన్న డ్రమ్‌స్టిక్ లాగా కనిపిస్తాయి. ఇది కోడి రెక్కలో మాంసం ఎక్కువగా ఉండే భాగం. ఈ భాగం వండితే జ్యుసీగా ఉంటుంది.

వింగెట్ (WINGETTE) 

వింగెట్ ను ఫ్లాప్ అని కూడా పిలుస్తారు. ఇది రెండు ఎముకల మధ్యలోని మాంసపు భాగం. ఈ మాంసం ముక్క సన్నగా ఉంటుంది.

Also read : Bharat Jodo Yatra: త్వరలో భారత్ జోడో, ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ యాత్ర

చికెన్ వింగ్స్ తయారీ మెటీరియల్

చికెన్ వింగ్స్ తయారీ విధానం