Site icon HashtagU Telugu

Nasscom Foundation : 4000 మంది మహిళా వ్యవస్థాపకులకు నాస్కామ్ ఫౌండేషన్ శిక్షణ

NASSCOM Foundation trains 4000 women entrepreneurs

NASSCOM Foundation trains 4000 women entrepreneurs

Nasscom Foundation : డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో గ్రామీణ మహిళా వ్యవస్థాపకులను శక్తివంతం చేయడానికి బలమైన పునాది వేస్తున్న నాస్కామ్ ఫౌండేషన్ ఇప్పుడు భారతదేశంలోని హెచ్ఎస్బిసితో కలిసి పనిచేస్తూ   మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో 4000 మంది మహిళా వ్యవస్థాపకులకు శిక్షణ ఇవ్వనుంది. “డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మహిళా వ్యవస్థాపకులకు అదనపు నైపుణ్యాలను అందించటంతో పాటుగా వారి భాగస్వామ్యాన్ని పెంచడం” అనే కార్యక్రమంలో పాల్గొన్న వారు అధిక స్థాయి డిజిటల్ , ఆర్థిక అక్షరాస్యత, వ్యవస్థాపకత అభివృద్ధి, వ్యాపారం , ఇ-గవర్నెన్స్ అప్లికేషన్‌పై దృష్టి సారించిన సమగ్రమైన జోక్యాలను అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హ్యాండ్‌హోల్డింగ్ మద్దతు , ఆన్-బోర్డింగ్ ద్వారా పొందుతారు.

Read Also: Houses : ఏపీలో వారందరికీ ఇళ్ల స్థలాలు – మంత్రి కీలక ప్రకటన

డిజిటల్ , ఆర్థిక అక్షరాస్యత పరిమితంగా ఉండటం వల్ల గ్రామీణ మహిళా వ్యవస్థాపకులకు డిజిటల్ సాధనాలను ఉపయోగించుకునే సామర్థ్యం ఉండక పోవటం తో , తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను వినియోగించుకోవటంలో ఆటంకం ఏర్పడుతుంది. మహిళల యాజమాన్యంలోని గ్రామీణ సంస్థలు 22-27 మిలియన్ల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. అయితే, మహిళా వ్యవస్థాపకులు తగిన రీతిలో రుణాలను పొందడంలో అడ్డంకులను ఎదుర్కొంటున్నారు, మధ్యస్థ స్థాయి వృద్ధికి తగిన విధాన మద్దతు లేకపోవడం చేత మార్కెటింగ్, సాంకేతికత , సలహా వంటి కీలకమైన వ్యాపార అభివృద్ధి సేవలను కోల్పోతున్నారు. ఈ కార్యక్రమం మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేయటం , వారి జీవనోపాధిని మెరుగుపరచడం , మహిళల ఆర్థిక సాధికారతను నడిపించే సాంకేతిక పరిష్కారాలను గుర్తించడం, నైపుణ్యం కల్పించడం, ప్రోత్సహించడం ద్వారా స్థిరత్వం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

నాస్కామ్ ఫౌండేషన్ సీఈఓ జ్యోతి శర్మ మాట్లాడుతూ.. “ఆర్థిక భాగస్వామ్యంలో లింగ అసమానత లోతుగా పాతుకుపోవడమే కాదు చాలా ఎక్కువగానూ ఉంది. సమానత్వాన్ని సాధించడంలో ఇది ప్రధాన సవాలుగా ఉంది. ఆ అంతరాన్ని తగ్గించడానికి మా నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. సమ్మిళితను పెంపొందించడానికి, సమాన అవకాశాలను సృష్టించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా నిరూపించబడింది. మహిళల జీవనోపాధి, ఆర్థిక భద్రత , స్థిరత్వంను పెంచడానికి డిజిటల్ చేరికను ముందుకు తీసుకెళ్లడానికి మేము అంకితభావంతో ఉన్నాము. హెచ్ఎస్బిసిఇండియాతో మా భాగస్వామ్యం ద్వారా, అందరికీ మరింత సమానమైన, సమగ్ర భవిష్యత్తును నిర్మించాలనే మా భాగస్వామ్య దృష్టికి అనుగుణంగా భారతదేశం అంతటా మహిళలకు సాధికారత కల్పించే వినూత్నమైన, సాంకేతికత-ఆధారిత పరిష్కారాలను తీసుకురావాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు.

భారతదేశంలోని హెచ్ఎస్బిసిగ్లోబల్ సర్వీస్ సెంటర్స్ హెడ్ మమతా మాదిరెడ్డి మాట్లాడుతూ.. “హెచ్ఎస్బిసివద్ద సమ్మిళితత అనేది మనం ఎవరో మరియు దానిని ఎలా సమగ్రంగా స్వీకరిస్తామో నిర్వచిస్తుంది. మా కస్టమర్లు, ప్రజలు మరియు మేము పనిచేసే సంఘాలతో సమ్మిళిత వాతావరణాన్ని నిర్మించడానికి మేము కృషి చేస్తున్నాము. సాధికారతతో మాత్రమే వృద్ధి వస్తుందని నేను నమ్ముతున్నాను. కార్యకలాపాలను విస్తరించడానికి, సాంకేతికతను ఉపయోగించడం మహిళలు ముందుకు సాగడానికి, వారి వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించడానికి , సరిహద్దులను దాటి వెళ్లడానికి సహాయపడుతుంది. నాస్కామ్ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో, టెక్ ఫర్ గుడ్ ఈ కార్యక్రమం యొక్క పరిమాణాన్ని పెంచుతుంది, ఇది సమాజాలలో మహిళలకు సమ్మిళిత వాతావరణాన్ని నిర్మించడంలో ఒక వేదికను అందిస్తుంది” అని అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని అమర్ కుటిర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్, ఢిల్లీ ఎన్ సి ఆర్ లోని సేవా భారత్, కర్ణాటకలోని హెడ్ హెల్డ్ హై ఫౌండేషన్ మరియు తెలంగాణ మరియు తమిళనాడులోని ధన్ ఫౌండేషన్ ద్వారా ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతోంది. సమగ్రమైన మరియు ప్రభావవంతమైన విధానాన్ని అనుసరించడానికి ఈ ప్రాజెక్ట్ వ్యూహాత్మకంగా అనేక దశల్లో నిర్మించబడింది.

Read Also: TTD : సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీటీడీ సమావేశం