NASA Spacecraft TO Crash: ఆస్టరాయిడ్ తో నాసా స్పేస్ క్రాఫ్ట్ ఢీ.. రేపు వేకువజామున సంచలన ప్రయోగం!!

ఆస్టరాయిడ్స్ వేగంగా దూసుకొచ్చి భూమిని ఢీకొంటే ఎలా ? ఎటువంటి ఉత్పాతం జరుగుతుంది ?

  • Written By:
  • Publish Date - September 27, 2022 / 08:35 AM IST

ఆస్టరాయిడ్స్ వేగంగా దూసుకొచ్చి భూమిని ఢీకొంటే ఎలా ? ఎటువంటి ఉత్పాతం జరుగుతుంది ? ఎంత నష్టం జరుగుతుంది ? ఆస్టరాయిడ్స్ ను భూమి వైపు రాకుండా అడ్డుకోవచ్చా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు.. ఎన్నో భయాలకు సమాధానం వెతికే ప్రయత్నంలో భాగంగా నాసా మంగళవారం సరికొత్త ప్రయోగం చేయబోతోంది. దీన్ని మంగళవారం (సెప్టెంబర్ 27న) వేకువజామున 4 గంటల 44 నిమిషాలకు నాసా అఫీషియల్ యూట్యూబ్ చానల్ లో ప్రసారం చేయబోతున్నారు. ఈ ప్రయోగంలో భాగంగా నాసాకు చెందిన స్పేస్ క్రాఫ్ట్ “dart” (డబుల్ ఆస్టరాయిడ్ రీ డైరెక్షన్ టెస్ట్) గంటకు 22,500 కిలోమీటర్ల వేగంతో ” Dimorphos” అనే ఆస్టరాయిడ్ ను ఢీకొట్టనుంది. ఈ ఆస్టరాయిడ్ 160 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది 780 మీటర్ల వెడల్పు ఉన్న “Didymos” అనే మరో పెద్ద ఆస్టరాయిడ్ చుట్టూ తిరుగుతోంది.
నాసా స్పేస్ క్రాఫ్ట్ వేగంగా ఢీకొట్టిన వెంటనే Dimorphos ఆస్టరాయిడ్ సాధారణంగా తిరిగే రూట్ మారిపోతుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
వెబ్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్..నుంచి నాసా శాస్త్రవేత్తలు ఈ ఘట్టాన్ని చూస్తూ జరుగుతున్న మార్పును.. స్పేస్ క్రాఫ్ట్ ఢీకొన్నాక ఆస్టరాయిడ్ దిశలో వచ్చే మార్పును అంచనా వేస్తారు.

గతంలో ఒక ఘటన..

2013 ఫిబ్రవరి 15న రష్యాలోదక్షిణ ఉరల్ ప్రాంతంలోకి దూసుకొచ్చిన ఉల్క విధ్వంసం సృష్టించింది. ప్రజల  హాహాకారాలతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు హోరెత్తాయి. దీని కారణంగా 33 మిలియన్ డాలర్ల నష్టం సంభవించింది. ఈ బీభత్సం సృష్టించిన ఉల్కకి ఉన్న శక్తి.. హిరోషిమాపై అమెరికా వేసిన అణుబాంబు కంటే 30 రెట్లు ఎక్కువని నాసా గుర్తించింది. ఫ్యూచర్ లో ఇంకొన్ని ఉల్కలు, ఆస్టరాయిడ్స్ ఇలా భూమిని ఢీకొనే ఛాన్స్ లేకపోలేదని అప్పట్లో వార్నింగ్ ఇచ్చింది. గ్రహశకలాలు, ఉల్కలు.. ఎప్పటికైనా భూమికి ప్రమాదకరమైనవే!! అందుకే అంతరిక్షంలో వాటిని స్పేస్‌ క్రాఫ్ట్‌ల ద్వారా ఢీకొట్టే ఆలోచనతో నాసా “dart” మిషన్ చేపట్టింది. ఆగస్టు 29న జరగాల్సిన డబుల్‌ ఆస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌ మిషన్‌ (DART Mission) రెండో ప్రయోగం ఇంజిన్‌లోని సాంకేతిక సమస్యలతో వాయిదా వేసింది. దీనిని ఫ్లోరిడాలో కేప్ కెనర్వాల్‌లోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి సెప్టెంబర్ 27న వేకువజామున 4:44 గంటలకు నిర్వహించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే గ్రహశకలం డైమోర్ఫోస్‌ను నాసా స్పేస్ క్రాఫ్ట్ ఢీకొంటుంది.

ఆస్టరాయిడ్‌ అంటే ?

ఆస్టరాయిడ్‌లు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల కిందట సౌర వ్యవస్థ ఏర్పడగా మిగిలిపోయిన రాతి శకలాలు. గ్రహశకలం భూమికి సమీపంలో ఉన్న వస్తువుగా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. మనం నివసించే భూగోళం నుంచి దాని దూరం 93 మిలియన్ మైళ్లు. ఇది భూమికి, సూర్యుడికి మధ్య దూరం కంటే 1.3 రెట్లు తక్కువ.