Site icon HashtagU Telugu

Nasa Image: ఇండియాపై నాసా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్

NASA delhi

NASA delhi

నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక ఆసక్తికర ఫోటోను షేర్ చేసింది. మే 5 అర్ధరాత్రి ఎకో స్ట్రెస్ పరికరంతో నాసా ఢిల్లీలోని భూ ఉష్ణోగ్రతల ఫోటోను తీసింది. ఈ ఫోటోతో ఇండియాలో కొనసాగుతున్న హీట్‌వేవ్‌కు సంబంధించిన అనేక విషయాలు అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నాసా చెప్తున్నా వివరాల ప్రకారం ఢిల్లీలోని అర్బన్ ప్రాంతాలతో పాటు పొరుగు గ్రామాలలో ఉష్ణోగ్రత 102 డిగ్రీల ఫారెన్‌హీట్ చేరుకుంది.

నాసా బయటపెట్టిన ఈ ఫోటోలో చాలా వివరలున్నాయని శాస్రవేత్తలు చెబుతున్నారు. మార్చి నెల మధ్య నుండి, భారతదేశం మరియు పాకిస్తాన్‌లు ఎడతెగని వేడి గాలులతో ఇబ్బంది పడుతున్నాయని, దీని ఫలితంగానే అధికంగా మరణాలు సంభవిస్తున్నాయని తెలుస్తోంది. వీటివల్లే వాయు కాలుష్యం ఏర్పడుతోందని, వ్యవసాయంలో కూడా ఉత్పత్తి తగ్గిందని ఈ పరిస్థితి ఇండియాకి తీవ్రమైన ఇబ్బందులు కల్గిస్తుందని తెలుస్తోంది.

గ్రామీణ ప్రాంతాల కంటే నగరాల్లో వేడి గాలులు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. కానీ ఢిల్లీ పరిస్థితి చేయి దాటిపోనుందని, దీనిపై ముందస్తు చర్యలు తీసుకోకపోతే ఢిల్లీ నామరూపాలు లేకుండా పోయే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసా పెట్టిన ఈ పోస్ట్ కు ఇప్పటికి వందల కొద్ది లైక్స్ రావాడంతో పాటు ఇండియాలో హీట్‌వేవ్‌ తగ్గించడానికి ఏమేం చేయాలనే చర్చను లేవనెత్తింది.

Exit mobile version