Site icon HashtagU Telugu

Asteroid Bennu : ఆ ఆస్టరాయిడ్ పై ప్లాస్టిక్ బాల్స్ పూల్ ను తలపించే ఉపరితలం

Bennu

Bennu

ప్లాస్టిక్ బాల్స్ తో ఉండే పూల్ లోకి పిల్లలను వదిలితే ఎంచక్కా ఆడుతూ ఎంజాయ్ చేస్తారు. దానిలోనే పడుతూ, లేస్తూ సరదాగా గడుపుతారు. అచ్చం ప్లాస్టిక్ బాల్స్ తో ఉండే పూల్ తరహా స్వభావం కలిగిన ఉపరితలాన్ని “బెన్ను” అనే గ్రహ శకలం (ఆస్టరాయిడ్) పై నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.నాసా 2020 అక్టోబర్లో ఒక మిషన్ ను బెన్ను ఆస్ట రాయిడ్ కోసం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా “OSIRIS-REx” అనే వ్యోమనౌక ను 2018 అక్టోబర్ లో బెన్ను ఆస్ట రాయిడ్ పై దింపింది. ఉపరితల శాంపిళ్ళ సేకరణ కోసం..ఇది ఆస్ట రాయిడ్ పైనున్న ఉపరితలంలోకి డ్రిల్లింగ్ యంత్రాన్ని దింపగానే అనూహ్య పరిణామం జరిగింది. “బెన్ను” ఆస్ట రాయిడ్ ఉపరితలం పై ఉండే దుమ్ము, రాళ్లతో కూడిన కణాలు వెంటనే చాలా ఎత్తుకు లేచాయి. కాసేపు గాల్లోనే తేలియాడి, మళ్లీ ఉపరితలంపై పడిపోయాయి. దీన్నిబట్టి “బెన్ను” ఆస్ట రాయిడ్ ఉపరితలం భూమిలా గట్టిగా కాకుండా.. ప్లాస్టిక్ బాల్స్ తో ఉండే పూల్ లా మెత్తగా ఉందని వెల్లడైంది. ఇంత తేలిగ్గా గాల్లోకి లేచే స్వభావం కలిగిన “బెన్ను” ఆస్ట రాయిడ్ ఉపరితల కణాలు మరి ఎలా కలిసి ఉండగలుగు తున్నాయి ? అనేది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది.

అదేమిటంటే..అంతరిక్ష వాతావరణం లో నీటి బుడగను ఊదితే.. చాలా సేపటి పాటు పెద్ద సైజులో యాక్టివ్ గా తిరుగుతూనే ఉంటుంది. కానీ భూమి మీద ఉండే వాతావరణం లో నీటి బుడగ ..మనం ఊదిన వెంటనే పగిలిపోతుంది. వాస్తవానికి నీటిబుడగ లోని అణువులు చాలా బలహీనమైనవి. అవి సులభంగా విడిపోగలవు.కానీ అంతరిక్ష వాతావరణం లో ఉండే వైరుధ్యం కారణంగా నీటి బుడగలోని అణువులు బలంగా పెనవేసుకుపోయి ఉండిపోతాయి . సరిగ్గా ఇదే సూత్రం ప్రకారం.. “బెన్ను” ఆస్ట రాయిడ్ ఉపరితలం పై ఉండే రాళ్లు, ధూళి కణాలు కలిసిపోయి ఉండగలుగు తున్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. రాళ్లు, ధూళి కణాల అణువులు బలంగా కలిసి ఉండటం అసహజం. అయితే అంతరిక్ష వాతావరణం కారణంగా ఇవి కలిసిపోయి బలమైన బాండింగ్ తో ఉంటున్నాయని చెప్పారు. తొలిసారిగా “బెన్ను” ఆస్ట రాయిడ్ ను శాస్త్రవేత్తలు1999 సంవత్సరం లో గుర్తించారు. ఈ గ్రహ శకలం ఉపరితలం బీచ్ ను తలపించేలా ఉంటుందని అప్పట్లో పరిశోధకులు అంచనా వేశారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నమని.. దాని ఉపరితలం చాలా వెరైటీ అని వ్యోమనౌక దిగాక తెలిసిపోయింది.