Parker Solar Probe : సైన్స్ చ‌రిత్ర‌లో అద్భుతం..సూర్యుడిని చేరిన నాసా

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించింది.

  • Written By:
  • Updated On - December 15, 2021 / 12:48 PM IST

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించింది. నాసా ఈ మ‌ధ్య‌నే లాంచ్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడి బాహ్య ఉప‌రిత‌లాన్ని తాకిన‌ట్టు ఆ సంస్థ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అసాధ్యం అనుకుంది సాధించి మరోసారి చరిత్ర సృష్టించింది నాసా.

పార్కర్ సోలార్ ప్రోబ్ అనే రాకెట్ షిప్ ను 2018 లో లాంచ్ చేశారు. ఏకంగా 93 మిలియ‌న్ మైళ్లు ప్ర‌యాణించి 2021 డిసెంబ‌ర్ 14వ తారీఖున సూర్యుడి పై పొరలోకి ప్రవేశించిందని నాసా పేర్కొంది. ఇది సైన్స్ చరిత్ర లో ఒక మైలు రాయిగా.. సోలార్ సైన్స్ ను ఇంకా క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక్కసారి అది ల్యాండ్ అయ్యాక సూర్యుడు అనే నక్షత్రం ఎలా ఏర్పడింది అనే ప్రశ్నతో సహా అనేక విషయాలు తెలుసుకునే అవకాశం ఉందని అని చెప్పుకొచ్చింది.

పార్కర్ సోలార్ ప్రోబ్ విజయం తో సృష్టి లో మిస్టరీగా మిగిలిపోయిన అనేక ప్రశ్నలకు సమాధానం దొరక‌బోతోంది. రెండు మిల్లియన్ ఫారెన్హీట్ ఉన్న పొరలోకి ప్రవేశించిన ఈ స్పేస్ క్రాఫ్ట్ ను టంగ్స్టన్ , నియోబియం , మొలిబ్డినం , స్ఫహిర్ తో కూడిన లోహాలతో తాయారు చేశారు.