Site icon HashtagU Telugu

Space : అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే!

Nasa Astronaut Single Space

Nasa Astronaut Single Space

దాదాపు 9 నెలల తర్వాత ISS నుంచి భూమికి చేరిన సునీతా విలియమ్స్ (Sunita Williams) పై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. ఇక NASA వ్యోమగాములు (NASA Astronauts) ఎక్కువ కాలం పాటు ఇంటర్నేషనల్ స్పేస్(Space) స్టేషన్‌లో ప్రయాణించి అంతరిక్ష అనుభవాన్ని పొందుతారు. ఒక్కో వ్యోమగామి చేసిన దీర్ఘకాలిక ప్రయాణాలను NASA ప్రత్యేకంగా నమోదు చేస్తోంది. అంతరిక్షంలో గడిపిన గరిష్ట రోజులను గుర్తించి, ఒకే మిషన్‌లో ఎక్కువ రోజులు ఉన్న రికార్డు మరియు మొత్తం వ్యోమగామి కెరీర్‌లో గడిపిన రోజుల సంఖ్యను లెక్కిస్తుంది.

IPL Opening Ceremony: ఐపీఎల్ ప్రారంభ వేడుక‌లు.. 13 స్టేడియాల్లో రంగం సిద్ధం!

ఇప్పటివరకు NASA వ్యోమగామి ఫ్రాంక్ రుబియో 371 రోజులు అంతరిక్షంలో గడిపి, ఒకే మిషన్‌లో ఎక్కువ రోజులు గడిపిన రికార్డును నెలకొల్పారు. ఆయన మునుపటి రికార్డు హోల్డర్ మార్క్ వాండే హీ (355 రోజులు) మరియు స్కాట్ కెల్లీ (340 రోజులు)లను అధిగమించారు. NASA వ్యోమగామి పెగ్గీ విట్సన్ 675 రోజులు అంతరిక్షంలో గడిపి, అత్యధిక క్యూమలేటివ్ రోజుల రికార్డును కలిగి ఉన్నారు. ఆమె అక్సియం స్పేస్ మిషన్-2లో తొమ్మిది రోజులు గడిపి, తన రికార్డును మరింత పెంచుకున్నారు. సునీత విలియమ్స్ 608 రోజులతో రెండవ స్థానంలో ఉండగా, జెఫ్ విలియమ్స్ 534 రోజులతో మూడవ స్థానంలో ఉన్నారు. NASA చరిత్రలో వీరు అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన ప్రముఖ వ్యోమగాములుగా నిలిచారు.