Site icon HashtagU Telugu

Infosys Vs Wipro : విప్రో వాళ్లు జాబివ్వలేదు.. అందుకే ఇన్ఫోసిస్ పెట్టాను : నారాయణమూర్తి

Infosys Vs Wipro

Infosys Vs Wipro

Infosys Vs Wipro : ఇన్ఫోసిస్ సంస్థ పుట్టుకకు కారణం విప్రో సంస్థే అని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు. తాను విప్రో కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లగా.. ఆ సంస్థ అధికారులు తిరస్కరించారని చెప్పారు. దీంతో తాను మరో ఆరుగురు మిత్రులతో కలిసి.. భార్య సుధామూర్తి ఇచ్చిన డబ్బులతో కొత్త ఐటీ కంపెనీని ప్రారంభించానని వివరించారు. అలా ఏర్పాటైన ఐటీ కంపెనీయే ఇన్ఫోసిస్ అని ఎన్ఆర్ నారాయణమూర్తి వెల్లడించారు. తనకు విప్రోలో ఉద్యోగం దొరకలేదనే ఆలోచనతోనే ఇన్ఫోసిస్ సంస్థకు బీజం పడిందన్నారు. ఈ విషయంపై విప్రో సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్‌జీ తనతో మాట్లాడిన విషయాలనూ నారాయణ మూర్తి గుర్తు చేసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘ఆ రోజు నారాయణకు ఉద్యోగం ఇవ్వకపోవడం అప్పటి విప్రో పెద్దలు చేసిన అతిపెద్ద తప్పుడు నిర్ణయాల్లో ఒకటి. ఒక వేళ నారాయణ మూర్తికి ఉద్యోగం ఇచ్చి ఉంటే విప్రో సంస్థ మరోలా ఉండేది’’ అని అజీమ్ ప్రేమ్ జీ తనతో చెప్పారని నారాయణ మూర్తి వివరించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలను వెల్లడించారు. కాగా, సుధామూర్తి కామెంట్‌తో వెజ్, నాన్ వెజ్ పై పెద్ద దుమారమే రేగగా.. 70 గంటల పని విధానం అవసరమని నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు(Infosys Vs Wipro) చర్చనీయాంశమయ్యాయి.

Also Read: Abhaya Hastam Status : అభయహస్తం వెబ్‌సైట్‌లో టెక్నికల్ సమస్య.. పరిష్కారమయ్యేనా ?

ఇటీవల ప్రముఖ టెక్ కంపెనీ TCS కొన్ని సంస్థలను కొనుగోలు చేసింది. ఇప్పుడు మరో దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఓ కంపెనీని సొంతం చేసుకోనుంది. 2024లో తన మొదటి టేకోవర్‌ను బాంబే స్టాక్‌ మార్కెట్ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో ప్రకటించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సెమీకండక్టర్ డిజైన్ మరియు ఎంబెడెడ్ సేవలను అందించే ఇన్‌సెమీని ఇన్ఫోసిస్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 280 కోట్లు వ్యయం చేయనున్నట్లు ఎక్స్ఛేంజ్‌లో ఫైలింగ్‌లో పేర్కొంది. 153.6 కోట్ల ఆదాయ సామర్థ్యం కలిగిన ఈ కంపెనీ కొనుగోలు.. 2024 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ముగుస్తుందని వెల్లడించింది.

ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత

ఆర్థిక మాంద్యం భయాలు, వ్యయ నియంత్రణ చర్యలు వెరసి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతను కొనసాగిస్తున్నాయి. గూగుల్‌, ఫ్లిప్‌కార్ట్‌, యూనిటీ సాఫ్ట్‌వేర్‌, పేటీఎం, అమెజాన్‌ తదితర ఐటీ, ఈ-కామర్స్‌ కంపెనీలు ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులను తొలగించగా ఇప్పుడు ఆ జాబితాలోకి దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ చేరాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్‌-డిసెంబర్‌) ఈ రెండు కంపెనీలు ఏకంగా 11, 781 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్స్‌ ఇచ్చినట్టు పారిశ్రామికవర్గాలు తెలిపాయి. ఇందులో టీసీఎస్‌ 5,680 మందిపై వేటు వేయగా, ఇన్ఫీ 6,101 మందికి ఉద్వాసన పలికింది.