Site icon HashtagU Telugu

Nara Lokesh : హైదరాబాద్ కు చేరుకున్న నారా లోకేశ్

Lokesh Hyd

Lokesh Hyd

ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తన అమెరికా పర్యటన (America Tour)ను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల సమీకరణకు ముఖ్యమైన కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రోత్సహించే విధంగా పలు చర్చలు జరిపారు.

పర్యటనలో భాగంగా, కొత్తగా వచ్చే కంపెనీలకు తక్షణ అనుమతులు జారీ చేయడం ద్వారా వ్యాపార సమర్థతను పెంచుతామంటూ బ్లూప్రింట్ ప్రణాళికను వివరించారు. ఈ ప్రణాళిక ద్వారా పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తామని, వ్యాపార సంస్థలకు ప్రభుత్వం నుండి పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని కంపెనీల ప్రతినిధులకు నమ్మకం కలిగించారు. నారా లోకేశ్ అక్కడి పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించేందుకు ఆహ్వానించారు.

అలాగే ఈ పర్యటనలో ఆయా కంపెనీలతో రాష్ట్రంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, విద్యుత్తు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ప్రత్యేకంగా పలు కంపెనీలకు ప్రోత్సాహక ప్యాకేజీలు, మద్దతు పథకాలు అందించే విధంగా రూపొందించిన ప్రణాళికలను వివరించడం జరిగింది. అంతేకాకుండా, రాష్ట్రంలోని అమరావతి ప్రాంతాన్ని సాంకేతిక కేంద్రంగా మార్చడం, తద్వారా ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడం ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంపై ఆయన ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇక ఈ పర్యటన వల్ల విదేశీ పెట్టుబడులు మరింత పెరగడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌కు నూతన పరిశ్రమలు రాబోయే అవకాశాలు మెరుగుపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

Read Also : New Ration Cards : జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలనీ ఏపీ సర్కార్ కసరత్తులు