Nagaland Minister: రండి, బ్రహ్మచారుల ఉద్యమంలో చేరండి: నాగాలాండ్ మంత్రి

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా పెరిగిపోతుంది. కాగా ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని

  • Written By:
  • Publish Date - July 12, 2022 / 05:44 AM IST

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా పెరిగిపోతుంది. కాగా ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని దేశాలలో ముగ్గురు పిల్లలు వద్దు ఇద్దరు పిల్లలు ముద్దు అంటూ ఆదేశాలను కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు దేశ జనాభా సంఖ్యలో అగ్రస్థానంలో కూడా నిలిచిన విషయం తెలుస్తుంది. ప్రతి ఒక్క దేశంలో ఏడాదికి కోట్లలో జనాభా పెరుగుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇక నేడు ప్రపంచ జనాభా దినోత్సవం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జనాభా గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనమంతా వివేకంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ జనాభా పెరుగుదలపైనా, సంతానం కలిగి ఉండడంపైనా ప్రచారంలో ఉన్న విధానాలపై ఆలోచిద్దాం.. లేకపోతే నాలాగా ఏకో నారాయణలా ఉండండి..అందరం కలిసి సుస్థిర భవిష్యత్తు దిశగా పాటుపడదాం..రండి, బ్రహ్మచారుల ఉద్యమంలో చేరండి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం టెమ్జెన్ ఇమ్నా నాగాలండ్ క్యాబినెట్ లో ఉన్నత అలాగే సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. నాగాలాండ్ బీజేపీకి కూడా టెమ్జెన్ ఇమ్నానే అధ్యక్షుడు. ఈయన ఎప్పుడూ కూడా సరదాగా ఉంటారు అని అందరు అంటూ ఉంటారు.