Site icon HashtagU Telugu

Mystery: స్పింక్స్ ఎవరు నిర్మించారు.. ఇంతకు ఆ విగ్రహం ఎలా వచ్చింది?

The Sphinx

The Sphinx

స్పింక్స్ అనగానే వెంటనే ఈజిప్టు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పిరమిడ్లు ఎదురుగా స్పింక్స్ ఉంటాయి. స్పింక్స్ అంటే మనిషి తల, సింహం శరీరంతో భారీ విగ్రహంలా క‌నిపించే పురాతన క‌ట్ట‌డం. అలాంటి విగ్ర‌హాల‌ను ఎవరు నిర్మించారు.. అసలు ఆ విగ్ర‌హాలు ఎలా వ‌చ్చాయి? వాటి నిర్మాణం వెనుక ఉన్న ఆస‌క్తిక‌ర‌మైన విషయాలను తెలుసుకుందాం.

కొంత‌మంది పురాత‌త్వ చరిత్రకారులు.. రాజు ఖాఫ్రే కోసం దీనిని నిర్మించారని చెబుతారు. ఈజిప్షియ‌న్లు త‌మ దైవంగా భావించే ‘సూర్య దేవుడు రా’ కి సేవలు చేసేందుకు నిర్మించారని న‌మ్ముతున్నారు. అయితే, దీనిపై స్ప‌ష్ట‌మైన ఆధారాలైతే ఏమీ లేవు. పైగా ఫారో ఖాఫ్రే ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా అక్కడ ఒక్క ఆధారం కూడా లేదట. అక్కడున్న గోడలపైన కూడా స్పింక్స్ కు సంబంధించి ఎటువంటి వివరాలు లేవ‌ట‌.

అయితే, ఈ స్పింక్స్‌కు సంబంధించి పాత ఈజిప్టు ర‌చ‌న‌ల్లో కొన్ని ఆధారాలు ల‌భించాయి. గిజా పిరమిడ్ దగ్గర రాసి ఉన్న అనుబిస్ అనే ప‌దానికి, స్పింక్స్‌కు ద‌గ్గ‌రి సంబంధాలున్న‌ట్టు చ‌రిత్ర‌కారులు చెబుతారు. అనుబిస్ అంటే ఈజిప్ట్ భాష‌లో స్పింక్స్ అని అర్ధం.

ఎన్ని ఆధారాలు ఉన్నా.. ఒక‌దానికి ఒక‌టి పొంత‌న లేక‌పోవ‌డంతో స్పింక్స్ నిర్మాణంపై ఇప్ప‌టికీ ఎలాంటి క్లారిటీ ల‌భించ‌లేదు. ఇది ఎందుకు నిర్మించారు. ఏం చేయాలని నిర్మించారు అనేది మాత్రం ఎటువంటి ఆధారాలు లేవని ఇక్కడ పరిశోధనలు చేసిన జేమ్స్ అల్లెన్ తెలిపారు.

ఎడ్గార్ కాయ్స్ అనే శాస్త్రవేత్త 1932లో దీని గురించి ఓ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం తెలిపాడు. అచేత‌న నిద్రావ‌స్ధ‌లోకి (ట్రాన్స్‌) వెళ్ల‌డం ద్వారా చ‌రిత్ర‌కు సంబంధించి విష‌యాలు చెబుతాడ‌ని కాయ్స్‌కు పేరుంది. అలానే ఓ సంద‌ర్బంలో ట్రాన్స్‌లోకి వెళ్లిన కాయ్స్‌.. స్పింక్స్ గురించి కొన్ని అంశాలు బ‌య‌ట‌పెట్టాడు. అట్లాంటిషియన్లు క్రీస్తుపూర్వం 10,500 కాలంలో దీనిని నిర్మించారు అని.. దీని కింద ఒక రహస్య గది ఉందని.. అందులో నాగరికత విజ్ఞానం, మానవజాతికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఉన్నాయని తెలిపారు. అయితే అత‌ను చెబుతోంది నిజమా కాదా అనేది తెలుసుకునేందుకు సైంటిస్టులు ఆధునిక పరికరాలతో పరిశోధించారు. అక్కడ నిజంగా గదులు ఉన్నట్టు తేలింది.

Exit mobile version