Site icon HashtagU Telugu

Viral Video: నెట్టింట వైరల్ అవుతున్న‌ గ్రీన్ స్నేక్..!

Bizarre Snake Vide

Bizarre Snake Vide

ప్ర‌స్తుతం నెట్టింట డ్రాగ‌న్ స్నేక్ వైర‌ల్ అవుతోంది. ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ పాము, ఒళ్లంతా నాచు లాంటి వెంట్రుకలతో చూసేందుకు వింతగా ఉంది. దీంతో యూట్యూబ్‌లో సోష‌ల్ మీడియాల్లో ఆ పామును చూసిన‌ నెటిజన్లు ఆశ్చర్యానికి గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ఇలాంటి పాములు కూడా ఉంటాయా అని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. థాయిలాండ్‌లోని సఖోన్ నఖోన్ ప్రావిన్స్‌లో ఈ వింత ఆకుప‌చ్చ‌ పామును గుర్తించారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారింది. సఖోన్ నఖోన్ ప్రావిన్స్‌కి చెందిన 49 ఏళ్ల ఓ వ్యక్తి మొద‌ట ఈ పామును గుర్తించాడు. తన ఇంటికి కొద్ది దూరంలోని ఓ నీటి మడుగులో దీని గుర్తించినట్లు చెప్పాడు. చూడటానికి చాలా వింతగా ఉండటంతో దాన్ని ఒక జాడిలో వేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పామును చూసిన అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారని ఆ వ్య‌క్తి తెలిపాడు. దాన్ని జాడి నుంచి తీసి నీళ్లు పోసిన ఒక పాత్రలో వేశారు.

ఈ వింత పాముకు ఉన్న ప్ర‌త్యేక‌త ఏంటంటే.. సాదార‌ణంగా పాముల శరీరంపై ఒక్క వెంట్రుక కూడా ఉండదు. కానీ ఈ పాము ఒంటి నిండా నాచు లాంటి వెంట్రుకలు ఉండటం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వింత పాముకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా, యూట్యూబ్‌ల‌లో అప్‌లోడ్ చేయడంతో అది కాస్త ఇప్పుడు ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఇక‌పోతే ఈ వీడియో చూసిన నెటిజ‌న్ల‌లో కొంద‌రు దీన్ని డ్రాగన్ స్నేక్ అని కామెంట్ చేస్తుండటం గమనార్హం.