Muslim Girl: గాయత్రీ మంత్రం ఈ ‘ముస్లిం’ యువతి విజయ రహస్యం!

ఓ ముస్లిం యువతి నిత్యం గాయత్రీ మంత్రం చదువుతూ అద్భుతాలు క్రియేట్ చేస్తోంది.

  • Written By:
  • Updated On - June 7, 2023 / 03:12 PM IST

లక్నోలోని పేద ముస్లిం కుటుంబంలో జన్మించిన గజాలా అనే ముస్లిం అమ్మాయికి ఆధ్యాత్యిక గ్రంధాలు, రామాయణ, మహాభారత్ లాంటివి చాలా ఇష్టం. ఈ అమ్మాయి సంస్కృతంలో లక్నో విశ్వవిద్యాలయంలో 5 బంగారు పతకాలు సాధించింది ఆశ్చర్యపర్చింది. ప్రస్తుతం సంస్కృతంలోనే పరిశోధన చేస్తోంది. అంతేకాదు.. NETకి 3 సార్లు హాజరయ్యింది. ప్రతిసారీ విజయం సాధించింది. కానీ ఈ అమ్మాయి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లున్నాయి. దినసరి కూలీ చేస్తూ 5గురు పిల్లలకు చదువు చెప్పాలని కలలుగన్న తండ్రి క్యాన్సర్‌ తో చనిపోయాడు. ఆర్థిక పరిస్థితులు వెంటాడినా గజాలా ఆగిపోకుండా తన చదువును కొనసాగించింది. ‘‘నేను లక్నోలోని నిషాత్‌గంజ్ ప్రభుత్వ పాఠశాల నుండి నా చదువును ప్రారంభించాను. నాల్గవ తరగతిలో మీనా మేడమ్ సహాయంతో నేను సంస్కృతం చదవడం, అర్థం చేసుకోవడం ప్రారంభించాను. ఆ తర్వాత లక్నోలోని ఆర్య కన్యా ఇంటర్ కాలేజ్, బాద్షా నగర్‌లో 6 నుంచి 12 వరకు చదువుల కోసం అడ్మిషన్ తీసుకున్నా.

అక్కడ సంస్కృతం బోధించడంతో పాటు వేదాలు, శాస్త్రాల గురించి కూడా చెప్పింది అర్చన మేడం. ఆ తర్వాత వేదాలలో చెప్పబడిన విషయాలు ఇస్లాంలో కూడా ఉన్నాయని తెలిసింది. మా ఉపాధ్యాయులు నాకు చాలా మద్దతు ఇచ్చారు. నన్ను ముందుకు సాగేలా ప్రేరేపించింది. పది, ఇంటర్ లో మంచి మార్కులతో పాసయ్యాను.  ఆయన గైడెన్స్ వల్లే 2016లో 12వ ర్యాంకులోనూ అగ్రస్థానంలో నిలవగా.. సీఎం అఖిలేష్ యాదవ్ 30 వేల రూపాయల చెక్కు ఇచ్చారు.

నేను చదువు కోసం వెళ్లినప్పుడు అమ్మ తరచుగా అనారోగ్యానికి గురవుతుంది. కడుపులో కణితి ఉన్నట్లు తేలింది. ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. సీఎం నుంచి వచ్చిన డబ్బును ఆయన చికిత్సకు ఖర్చు చేశారు. మా నాన్నను కోల్పోయిన తర్వాత మా అమ్మ ఆరోగ్యం బాగోలేదని అన్నదమ్ములమైన మాకు చాలా భయం వేసింది. అతి కష్టం మీద ఆమె కోలుకుంది. ప్రజలు సనాతన సంస్కృతి గురించి అపోహలు వ్యాప్తి చేస్తారు, వివిధ విషయాలు మాట్లాడతారు. నేను కూడా అలాంటివి విన్నాను. కానీ సంస్కృతం, వేదాలు చదివినప్పుడు, ప్రతిదీ పూర్తిగా విరుద్ధంగా కనిపించింది. అందుకే నాకు వేదమంత్రాలు పఠించడం, ఋగ్వేదం చదవడం అంటే చాలా ఇష్టం.

గాయత్రీ మంత్రమైనా లేదా ఋగ్వేదంతో సహా ఇతర వేద మంత్రాలైనా వాటి పఠనం చాలా శక్తిని ఇస్తుంది. నేను ఉదయం 5 గంటలకు లేచి చదువు ప్రారంభించేటప్పటికి పెద్దగా జపం చేసేదాన్ని. నా ఇంట్లో అందరూ వింటారు. ఇది వింటుంటే మా అమ్మకి ఎన్నో మంత్రాలు గుర్తొచ్చాయి. నన్ను సంస్కృతం చదవకుండా ఎవరూ ఆపలేదు. అందరి మద్దతు లభించింది. ఇంట్లో అమ్మ నుంచి ఉర్దూ, అరబిక్ గురించిన సమాచారం కూడా తెలుసుకున్నాను. నేను ఖురాన్‌తో పాటు వేద మంత్రాలను చదివాను. ఇప్పుడు లక్నో యూనివర్సిటీ నుంచి సంస్కృతంలో పీహెచ్‌డీ చేస్తున్నాను. ప్రొఫెసర్ అయ్యాక ఐఏఎస్ కావాలనే నా కలను కూడా నెరవేర్చుకుంటాను. వేదాలే నా విజయ రహస్యం అని అంటోంది’’ అని అంటోంది గజలా

Also Read: Milind Soman: మండుటెండలోనూ మిలింద్ సోమన్ వర్కవుట్స్, హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్స్