Mukesh Ambani – Death Threat : అక్టోబరు 27న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి ఈమెయిల్ ద్వారా వార్నింగ్ మెసేజ్ పంపాడు. తమకు రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ఈమెయిల్ సందేశం ద్వారా హెచ్చరించాడు. భారత్‌లో తమకు బెస్ట్ షూటర్స్ ఉన్నారని.. 20 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే వారి ద్వారా హత్య చేయిస్తామని ముఖేష్ అంబానీకి పంపిన వార్నింగ్ ఈమెయిల్‌లో ప్రస్తావించాడు. ఈవివరాలను తాజాగా శనివారం ఉదయం పోలీసులు వెల్లడించారు. ముంబైలోని అంబానీ నివాసం యాంటిలియాలోని భద్రతా అధికారులు తమకు ఈవిషయంపై కంప్లయింట్ చేశారని పోలీసులు చెప్పారు. ఆ వ్యక్తిపై ముంబైలోని గామ్‌దేవి పోలీసులు ఐపీసీ 387, 506 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join.
ముఖేష్ అంబానీకి హత్య బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. అంబానీ, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపు కాల్స్ చేసిన బీహార్ వ్యక్తిని ముంబై పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. ఆ బీహార్ వ్యక్తి.. దక్షిణ ముంబైలోని అంబానీ నివాసంతో పాటు హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ను పేల్చేస్తానని బెదిరించాడు. ఇక 2021లో దక్షిణ ముంబైలోని అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఒక వాహనాన్ని గుర్తించారు. ఆ వాహనంలో గుర్తించిన ఓ వ్యక్తి కొంతకాలం తర్వాత అనుమానాస్పద స్థితిలో శవమై(Mukesh Ambani – Death Threat) కనిపించాడు.