TDP: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రాజీనామా

  • Written By:
  • Updated On - February 21, 2024 / 11:21 AM IST

 

Muddaraboina Venkateswara Rao:ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాన పార్టీల్లో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. టికెట్ దక్కని నేతలు మరో ఆలోచనకు తావివ్వకుండా పార్టీలకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు(Muddaraboina Venkateswara Rao) పార్టీకి రాజీనామా(resigns)చేశారు. నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జీగా కొలుసు పార్థసారథిని చంద్రబాబు(chandrababu) నియమించిన సంగతి తెలిసిందే. దీంతో, అసంతృప్తికి గురైన ముద్దరబోయిన పార్టీకి రాజీనామా చేశారు. తన కార్యాలయంలో ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను కూడా ఆయన తొలగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మీకు, మీ పార్టీకి ఒక నమస్కారం అని చెప్పారు. పార్థసారథి ఇంకా టీడీపీ కండువా కూడా కప్పుకోలేదని… కానీ, ఆయనను నూజివీడు ఇన్ఛార్జీగా ప్రకటించారని మండిపడ్డారు. ఉరిశిక్ష వేసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారని… కానీ, తనను పార్టీ ఏమీ అడగలేదని వాపోయారు. వైసీపీ(ysrcp)లో చేరానని తానేమైనా చెప్పానా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్(cm jagan) ను కలిసి పలు అంశాలపై చర్చించానని… సీఎంను ఎవరైనా కలవొచ్చు కదా? అని అన్నారు. పదేళ్లు తనను వాడుకుని ఇప్పుడు వదిలేశారని విమర్శించారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, టీడీపీ అగ్రనాయకత్వం ముద్దరబోయినకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. బుజ్జగించేందుకు ప్రయత్నాలు కూడా చేసింది. కానీ, ముద్దరబోయిన రాజీపడలేదు. అంతేకాదు.. ఏకంగా నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకి వెళ్లి సీఎం జగన్ ను కూడా కలిశారు. ఈ పరిణామంతో చంద్రబాబు కీలక నిర్ణయం తీసేసుకున్నారు. ముద్దరబోయిన సీఎంవోకు వెళ్లడంతో.. పార్దసారధిని నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా నియమించారు. పార్థసారథి వైసీపీ టికెట్ మీద పెనమలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఈసారి పెనమలూరు టికెట్ ఆయనకు దక్కలేదు. దీంతో టీడీపీ తరపున నూజివీడు నుంచి బరిలోకి దిగనున్నారు.

నూజివీడు టీడీపీ(tdp) ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన..గత కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ(ysrcp) ఎమ్మెల్యేగా గెలుపొందిన కొలుసు పార్థసారథికి నూజివీడు టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం మొదలైన రోజు నుంచి ముద్దరబోయిన అసంతృప్తిగా ఉన్నారు. తనకు కాకుండా పార్థసారథికి టికెట్ ఇస్తారనే సమాచారం అందడంతో.. పార్టీ మారేందుకు ముద్దరబోయిన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు మోసం చేశారు అంటూ కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత వెళ్లి సీఎం జగన్ ను కూడా కలిశారాయన.

read also : Farmers Protest ‘ఛలో ఢిల్లీ’ పాదయాత్రను పునఃప్రారంభించిన రైతులు