దేశం రోజు రోజుకు ఎంతగానో అభివృద్ధి చెందుతున్న..మూఢనమ్మకాలు , చేతబడులు (Sorcery ) మాత్రం ప్రజలు మరచిపోవడం లేదు. ప్రతి రోజు మూఢనమ్మకాలు, చేతబడులతో మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. చేతబడి, బాణామతి, చిల్లంగి, మంత్రాలు ఇలా అనేక పేర్లతో పిలుస్తుంటారు. ఒక్కొ ప్రాంతంలో ఒక్కొ పేరుతో పిలుస్తారు. వాస్తవానికి అవన్నీ కల్పితాలు. రుజువుకు నిలబడి నమ్మకాలు. చేతబడి బాణామతి, మంత్రాలు చేస్తున్నారనే నెపంతో మూఢనమ్మకాల కారణంగా వారిని వెలివేయడం, పండ్లూడగొడ్డడం, మలమూత్రాలను తాగించడం వంటి హింసలకు గురి చేస్తూ, వారిపై దాడులు, హత్యలు ఇంకా సజీవ దహనాలు కూడా చేస్తూ వస్తున్నారు.
తాజాగా ఝార్ఖండ్ (Jharkhand) లో ఓ తల్లి తన ఏడాదిన్నర కుమార్తెను నరబలి ఇచ్చిన ఘటన మానవత్వానికే మచ్చతెచ్చింది. పలాము జిల్లాకు చెందిన అరుణ్ రామ్, గీతాదేవి (Geethadevi) దంపతులు జప్లా- ఛతర్ పుర్ ప్రధాన రహదారికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఖరద్ గ్రామంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా గీతాదేవి అత్త కౌసల్యా దేవి నవంబర్ 12వ తేదీ ఉదయం ధాన్యం నిల్వ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి వెళ్లింది. తనతోపాటు గీతాదేవిని రమ్మని కోరింది. అప్పుడు గీతాదేవి తన చిన్న కుమార్తెతో కలిసి జాప్లా (హుస్సేనాబాద్) వెళ్తానని చెప్పింది. అయితే అర్ధరాత్రి అయినా గీతాదేవి ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గీతాదేవి, చిన్నారి కోసం గాలింపు చేసారు. అయినప్పటికీ గీతాదేవి కనిపించలేదు.
గురువారం వేకువజామున 2 గంటల సమయంలో గీతాదేవి- అదే గ్రామానికి చెందిన మనోజ్ రామ్ ఇంటికి వెళ్ళింది. తన భర్తతో గొడవపడి గీతాదేవి తమ ఇంటికి వచ్చిందని మనోజ్ రామ్ కుటుంబ సభ్యులు భావించారు. ఈ క్రమంలో గీతాదేవి కుటుంబీకులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం తో వారు వచ్చి గీతాదేవిని తమ ఇంటికి తీసుకెళ్లి..మనవరాలి గురించి అరా తీయగా.. జప్లాలో ఉందని గీతాదేవి సమాధానం చెప్పింది. అనుమానం వచ్చి గీతాదేవిని ప్రశ్నించినా ఆమె నిజం చెప్పలేదు. దీంతో గ్రామస్థులు హుస్సేనాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గ్రామానికి 3కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. చిన్నారి శరీరం ఛిద్రమైన స్థితిలో ఉంది. ఛాతిపై పెద్ద కత్తిగాట్లు ఉన్నాయి. అలాగే సమీపంలో కాలిపోయిన బట్టలు, గాజులు, కుంకుమ కనిపించాయి. ఈ క్రమంలో పోలీసులు గీతాదేవిని తమదైన శైలిలో విచారించగా, అసలు నిజం తెలిపింది. తాను తాంత్రిక విద్యను నేర్చుకున్నట్లు గీతాదేవి తెలిపింది. ఈ క్రమంలోనే తన కుమార్తెను హత్యచేశానని, తర్వాతి రోజే మళ్లీ తన మంత్ర శక్తులతో కాపాడేదానినని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఘటన జరిగిన రోజు గీతాదేవి భర్త అరుణ రామ్ ఇంట్లో లేడు. ఛత్ పండగకు వచ్చిన సోదరిని అత్తవారింటి వద్ద దిగబెట్టేందుకు వెళ్లాడు. తన కుమార్తెను భార్యే చంపేసిందన్న విషయాన్ని తెలుసుకుని తట్టుకోలేకపోయాడు. తన భార్య పూర్తిగా ఆరోగ్యంగా ఉందని, ఆమెకు మానసిక సమస్యలేవీ లేవని తెలిపాడు. గీతాదేవి ఎందుకిలా చేసిందో తెలియట్లేదని అన్నాడు.
Read Also : Sree Leela Gifts To Allu Arjun :అల్లు అర్జున్ కు శ్రీలీల ఏ గిఫ్ట్ ఇచ్చిందో గిఫ్ట్ తెలుసా ..?