Site icon HashtagU Telugu

First Female Driver: సలాం సీమాదేవి.. ఆటో నడుపుతూ, కుటుంబానికి అండగా ఉంటూ!

Seema Devi

Seema Devi

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మగవాళ్లతో సమానంగా పోటీ పడుతూ తమదైన ముద్ర వేస్తున్నారు. కష్టసాధ్యమైన పనులను సైతం ఈజీగా చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. జమ్మూకు చెందిన సీమాదేవి గురించి తెలుసుకుంటే.. ఎవరైనా సలాం కొట్టాల్సిందే. జమ్ముకాశ్మీర్ అంటే నిత్యం తుపాకుల మోత. ఉగ్రవాదుల కాల్పులు అక్కడ సర్వసాధారణం. ఈ నేపథ్యంలో సీమాదేవి మహిళ ధైర్యంగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోశించుకుంటోంది. ఫలితంగా ఆటో నడిపిన మొదటి మహిళగా అవతరించింది. ముగ్గురు టీనేజర్ల తల్లి అయిన సీమా దేవి  నాలుగు నెలలుగా నగ్రోటా, దాని పరిసర ప్రాంతాల్లో ఇ-ఆటో నడుపుతోంది.

‘‘నా భర్త సంపాదన సరిపోకపోవడంతో ఈ ఉద్యోగంలో చేరాను. మా కుటుంబానికి అండగా నిలబడాలని, పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి భర్తకు సాయంగా నిలుస్తున్న” అని ఆమె చెప్పింది. 40 ఏళ్ల సీమాకు 15 ఏళ్ల కుమారుడు, 14 ఏళ్ల 12 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించడానికి తనకు వేరే ఉద్యోగం దొరకకపోవడంతో తాను ఈ- ఆటో నడపడం ప్రారంభించానని సీమా చెప్పారు. “నేను, నా భర్త రూ. 30,000 రుణం తీసుకున్నాం. రూ. 3,000 EMIపై ఇ-రిక్షాను కొనుగోలు చేసాం. నా భర్త నాకు ఇ-రిక్షా నడపడం నేర్పించాడు”అని ఆమె చెప్పింది. ‘నా ఆటోలో మహిళలు సురక్షితంగా ప్రయాణిస్తున్నారని అని తెలిపింది. చాలా మంది బాలికలను పాఠశాలలకు దింపుతారని ఆమెను స్థానికులు నమ్ముతున్నారు.