Site icon HashtagU Telugu

Mother Elephant Video: పిల్ల ఏనుగుకు సాయపడిన తల్లి ఏనుగు.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో!

Viral

Viral

ప్రపంచంలో తల్లి ప్రేమకు మించినది ఏదీ ఉండదేమో.. ఇది జంతువులకు కూడా వర్తిస్తుంది. మనుషుల్లో ఎలాగైతే ఫీలింగ్స్ ఉంటాయో, అటవీ జంతువుల్లోనూ అదే విధంగా ప్రేమ, బాధ, ఎమోషన్ లాంటివి  ఉంటాయి. సోషల్ మీడియా రాకతో ఏనుగుల సంబంధించిన ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఓ తల్లి ఏనుగు పిల్ల ఏనుగుకు సాయం చేసిన వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.

కొద్ది నెలల వయసున్న పిల్ల ఏనుగు నడవలేక ఇబ్బందులు  పడుతూ కింద పడిపోయింది. వెంటనే అలర్ట్ అయ్యిన తల్లి ఏనుగు పిల్ల ఏనుగు దగ్గరికి వచ్చి తోండంతో సాయ చేస్తుంది. మళ్లీ కిందపడకుండా జాగ్రత్త పడుతుంది. పిల్ల ఏనుగు అడుగుల్లో అడుగులు వేస్తూ తమ ప్రేమను వ్యక్తం చేసింది. ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్‌ను హర్ష్ మారివాలా అనే వ్యక్తి ట్విట్టర్‌ లో షేర్ చేయడంతో 1 లక్షకుపైగా వ్యూస్ సాధించింది.

 

Exit mobile version